హైదరాబాద్‌లో దారుణం: సోదరిపై అత్యాచారం | Man Molested Cousin At Banjara Hills Hyderabad And Blackmailing Her | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో దారుణం: సోదరిపై అత్యాచారం

Published Thu, Mar 11 2021 12:27 PM | Last Updated on Thu, Mar 11 2021 3:28 PM

Man Molested Cousin At Banjara Hills Hyderabad And Blackmailing Her - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బంజారాహిల్స్‌: వావీవరుసలు మరిచిన ఓ యువకుడు వరుసకు సోదరి అయిన యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో చిత్రీకరించి డబ్బులు డిమాండ్‌ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని మహాత్మాగాందీనగర్‌లో నివసించే బాధిత యువతి(22) ఎయిర్‌హోస్టెస్‌గా శిక్షణ పొందుతుంది. తన తల్లి సోదరి కొడుకు నిఖిల్‌ కర్ణాటకలోని బాలీ్కలో నివసిస్తుంటాడు. ఇటీవల నిఖిల్‌(27) హైదరాబాద్‌కు వచ్చి మహాత్మాగాందీనగర్‌లో అద్దెకుంటూ టైలర్‌గా పని చేస్తున్నాడు. అవసరం నిమిత్తం బాధిత యువతి నిఖిల్‌కు రూ.50 వేలు అప్పుగా ఇచ్చింది.

నిందితుడు నిఖిల్‌  

ఈ నెల 2వ తేదీన ఆ డబ్బు ఇస్తానని బాధితురాలిని నిఖిల్‌ తన గదికి పిలిచి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఆమెకు తాగించి మత్తులో నిద్రలోకి జారిన ఆమెపై అత్యాచారం చేసి వాటిని ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ నెల 4వ తేదీన బాధితురాలు తన డబ్బు ఏమైందని నిఖిల్‌ను నిలదీసింది. ఆ డబ్బు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. అంతేకాదు తాను రెండో తేదీన అత్యాచారం చేశానని ఎవరికైనా చెబితే ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో షాక్‌గురై ఆందోళన చెందిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్‌ 376, 506ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

యువకుడి అదృశ్యం 
బంజారాహిల్స్‌: అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుడు అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.88 ఫిలింనగర్‌ దుర్గాభవాని నగర్‌లో నివసించే బి.శివరామ్‌(29) అమీర్‌పేటలోని బ్యాంక్‌కు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది. ఈ మేరకు భార్య మీనాక్షి పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. 
చదవండి:
దారుణం: భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య
జూలియెట్‌ ఆత్మహత్య : సోదరుడే ముంచేశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement