అసభ్యకర ఫొటోలున్నాయంటూ బ్లాక్మెయిల్ | 20-yr-old youth held for raping, blackmailing college mate | Sakshi
Sakshi News home page

అసభ్యకర ఫొటోలున్నాయంటూ బ్లాక్మెయిల్

Published Sun, Nov 29 2015 5:13 PM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM

అసభ్యకర ఫొటోలున్నాయంటూ బ్లాక్మెయిల్ - Sakshi

అసభ్యకర ఫొటోలున్నాయంటూ బ్లాక్మెయిల్

విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో అదే కాలేజీకి చెందిన విద్యార్థిని ముంబై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

ముంబై: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో అదే కాలేజీకి చెందిన విద్యార్థిని ముంబై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత ఆర్నేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధిత యువతి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... బాధిత యువతి(20), నిందితుడు నౌషద్ జబ్బర్ సిద్ధిఖీ మహారాష్ట్రలోని ధారవి ప్రాంతానికి చెందినవారు. కాగా, వీరిద్దరూ బంద్రా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు. యువతికి సంబంధించిన అసభ్యకర ఫొటోలు తనవద్ద ఉన్నాయంటూ తాను చెప్పినట్లు చేయకపోతే సోషల్ నెట్వర్కింట్ సైట్లో ఫొటోలు పోస్ట్ చేస్తానంటూ బెదిరించి యువతిని అత్యాచారం చేసేవాడని డీసీపీ ధనంజయ్ కులకర్ణి వెల్లడించారు.

గత ఆర్నేళ్లుగా వికృత చేష్టలకు పాల్పడుతూ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని చెప్పారు. కాలేజీ సమీపంలోని ఓ భవనం పైభాగంలో ఈ నెలలో కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. వేధింపులు తట్టుకోలేని యువతి ఆదివారం ఉదయం తల్లికి విషయం తెలిపింది. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ వారిద్దరూ ఖేర్వడీ పోలీసులను ఆశ్రయించారు. యువతి ఫిర్యాదు ఆధారంగా నిందితుడు సిద్ధిఖీని ఆరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై 376, 377, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, గతంలో ఇలాంటి ఘటనలతో నిందితుడికి సంబంధాలున్నాయా అనే కోణంలోనూ విచారణ ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement