సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని, మంత్రి మల్లారెడ్డి మొదలుకుని అనేక కాంట్రాక్టు సంస్థలవారు ఆయన బ్లాక్‌మెయిలింగ్ దందాను చెప్తారని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ(పీయూసీ) చైర్మన్ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలసి మంగళవారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి గాడ్‌ఫాదర్ చంద్ర బాబు కూడా తమను ఏమీ చేయలేకపోయారని అన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ డ్రగ్స్‌కు చిరునామాగా మారిందనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఎక్సైజ్ ద్వారా ఆదాయం వస్తోందని, అక్కడి ముఖ్య మం త్రులు తాగుబోతులా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నిం చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు జనం లేక పొరుగు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తరహాలో కులవృత్తులకు ఏ ఇతర ముఖ్యమంత్రీ న్యాయం చేయలేదని ఎగ్గె మల్లేశం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment