అశ్లీల దృశ్యాలతో యువతిని బ్లాక్‌మెయిల్‌ | man blackmailed Mumbai based girl in Bangalore | Sakshi
Sakshi News home page

అశ్లీల దృశ్యాలతో యువతిని బ్లాక్‌మెయిల్‌

Published Fri, Mar 10 2017 7:51 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

అశ్లీల దృశ్యాలతో యువతిని బ్లాక్‌మెయిల్‌

అశ్లీల దృశ్యాలతో యువతిని బ్లాక్‌మెయిల్‌

బెంగళూరు: బెంగళూరులోని బార్‌లో పని చేస్తున్న ముంబైకి చెందిన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి దాన్ని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే....నగరంలోని రెసిడెన్సీ రోడ్‌లోనున్న ఓ బార్‌లో పని చేస్తున్న ముంబైకి చెందిన యువతి(21)కి రామ్మూర్తి నగర్‌కు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ చక్రధర్‌రెడ్డితో పరిచయమైంది. పరిచయం ప్రేమతో మారడంతో ఇద్దరూ రామ్మూర్తినగర్‌లో సహజీవనం సాగించారు.

అయితే కొద్ది కాలంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో గత ఫిబ్రవరిలో చక్రధర్‌రెడ్డి గొడవలు పరిష్కరించుకుందామంటూ యువతిని తన గదికి పిలుపించుకున్నాడు. యువతి గదికి రాగానే మత్తుపదార్థాలు కలిపిన డ్రింక్స్‌ ఇచ్చాడు. యువతి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. దీంతో యువతి రెండు రోజుల క్రితం రామ్మూర్తినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చక్రధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మధుమేహంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, చికిత్స పూర్తి కాగానే అరెస్ట్‌ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement