mumbai girl
-
చరిత్ర సృష్టించిన భారతీయ యువతి
‘మగాళ్లు చేస్తున్నారు.. మరి మహిళలెందుకు చేయలేరు?’ అని తన మదిలో మెదిలిన ప్రశ్న ఓ యువతిని ఉన్నత స్థానంలో నిలపింది. ఆ ప్రశ్నే ఆమెతో ప్రపంచ రికార్డు నమోదు చేసేలా చేసింది. ముంబైకి చెందిన 23 ఏళ్ల ఆరోహి పండిట్.. ఒక్కతే అల్ట్రా లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో అట్లాంటిక్ మహాసముద్రం చుట్టొచ్చి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆరోహి గుర్తింపు పొందింది. చిన్న పిట్టకు పెద్ద రెక్కలు ఉన్నట్లు ఉండే ఎయిర్‌క్రాఫ్ట్‌లో బలమైన గాలుల మధ్య సాహసోపేతంగా 3వేల కిలోమీటర్లు ప్రయాణించి ఔరా అనిపించింది. 17 ఏళ్ల నుంచే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపడం మొదలుపెట్టిన ఆరోహి.. తన అట్లాంటిక్ ప్రయాణాన్ని స్కాట్లాండ్లో ప్రారంభించి గత సోమవారమే గ్రీన్లాండ్లోని నుక్లో ముగించింది. ఈ రికార్డుపై ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘నాకు మహిళలు రికార్డులు సాధించడం కావాలి. కేవలం భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు వారి కలలను నేరవేర్చుకోవాలి. వారికి నేను స్పూర్తిగా నిలవాలి. మగాళ్లు ఈ తరహా రికార్డులు నెలకొల్పడం చూశాను. అప్పుడు నాకనిపించింది మగాళ్లు చేస్తున్నప్పుడు మహిళలు ఎందుకు చేయలేరని? వెంటనే నేను నా కలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాను. మొత్తానికి ఈ ప్రయాణం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఇదో అహ్లాదకరమైన రైడ్. నా ప్రయాణం చాలా అద్బుతంగా సాగింది. ప్రతి చోట నీలిరంగులోని నీరు.. అహ్లాదకరమైన ఆకాశం. ఎన్నటికి మరిచిపోలేని అద్భుతమైన మదురానుభూతిగా నా ప్రయాణం నిలిచిపోయింది.’ అని ఆరోహి సంతోషం వ్యక్తం చేసింది. ఆరోహి రైడ్ చేసిన ఎయిర్ క్రాప్ట్ పేరు మహి కాగా.. ఇది సినస్ 912 రకానికి చెందిన లైట్-స్పోర్ట్ ఎయిర్‌క్రాప్ట్. ఒకే ఇంజన్‌తో పనిచేసే ఈ ఎయిర్‌క్రాప్ట్ కేవలం 400 కేజీల బరువు మాత్రం ఉంటుంది. చూడటానికి తెల్లని పిట్టకు పెద్ద రెక్కలు ఉన్నట్లు ఉంటుంది. ఆరోహి భారత్ నుంచి తన రైడ్ ప్రారంభించి.. పాకిస్తాన్, ఇరాన్, టర్కీల మీదుగా ఆగుకుంటూ.. యూరప్ మీదుగా స్కాట్లాండ్ చేరింది. అక్కడి నుంచి తన అట్లాంటిక్ యాత్రను ప్రారంభించి ఐస్లాండ్, గ్రీన్లాండ్ మీదుగా చివరకు కెనడాలో ల్యాండ్ అయింది. ప్రస్తుతం ఆమె అలస్కా, రష్యాలను చుట్టొచ్చిన అనంతరం ఇంటికి రావాలనుకుంటుంది. ఆమె అనుకున్నట్టుగా జరగాలని ఆరోహికి ఆల్‌దిబెస్ట్ చెబుదాం. -
అశ్లీల దృశ్యాలతో యువతిని బ్లాక్మెయిల్
బెంగళూరు: బెంగళూరులోని బార్లో పని చేస్తున్న ముంబైకి చెందిన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి దాన్ని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే....నగరంలోని రెసిడెన్సీ రోడ్‌లోనున్న ఓ బార్లో పని చేస్తున్న ముంబైకి చెందిన యువతి(21)కి రామ్మూర్తి నగర్‌కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ చక్రధర్‌రెడ్డితో పరిచయమైంది. పరిచయం ప్రేమతో మారడంతో ఇద్దరూ రామ్మూర్తినగర్‌లో సహజీవనం సాగించారు. అయితే కొద్ది కాలంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో గత ఫిబ్రవరిలో చక్రధర్‌రెడ్డి గొడవలు పరిష్కరించుకుందామంటూ యువతిని తన గదికి పిలుపించుకున్నాడు. యువతి గదికి రాగానే మత్తుపదార్థాలు కలిపిన డ్రింక్స్ ఇచ్చాడు. యువతి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో యువతి రెండు రోజుల క్రితం రామ్మూర్తినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చక్రధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మధుమేహంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, చికిత్స పూర్తి కాగానే అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
తల్లిదండ్రులు మందలించారని..
ముంబైలో బాలిక అదృశ్యం.. వికారాబాద్‌లో ప్రత్యక్షం తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు వికారాబాద్ రూరల్: మార్కులు తక్కువ రావడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మందలించారని మనస్తాపం చెందిన ముంబై బాలిక ఇంట్లోంచి వచ్చింది. వికారాబాద్‌కు చేరుకున్న ఆమెను స్థానిక పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శంషొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... ముంబై థానే సమీపంలోని అమృత్‌నగర్‌కు చెందిన బాలిక జోయా(15) స్థానిక యూనివర్సల్ ఆర్టిక్ బీహాండ్ మోహ్ర ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈనెల 12న పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని బాలికను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన జోయా ఇంట్లోంచి బయటకు వచ్చింది. మరుసటి రోజు హైదరాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో వికారాబాద్‌కు చేరుకుంది. ఉదయం 11.30 నుంచి వికారాబాద్ రైల్వేస్టేషన్లో కూర్చున్న జోయాను ఆర్పీఎఫ్ సిబ్బంది గమనిస్తుండగా సాయంత్రం సమయంలో ఫినాయిల్ తాగేయత్నం చేసింది. వెంటనే అడ్డుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు 1098 చైల్డ్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ సిబ్బంది దేవకుమారి, రామేశ్వర్లు అక్కడికి చేరుకుని వికారాబాద్ పోలీసులకు విషయం చెప్పారు. అనారోగ్యంగా ఉన్న బాలికను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె చెప్పిన సమాచారంతో తన తల్లిదండ్రులకు వివరాలు తెలియజేశారు. బాలికను సోమవారం ఉదయం ఆస్పత్రి సిబ్బంది డిశ్చార్జి చేశారు. పోలీసులు ఆమెను చైల్డ్‌లైన్ అధికారులు సమక్షంలో ఉంచారు. జోయా తల్లిదండ్రులు వికారాబాద్‌కు చేరుకుని పోలీసులను సంప్రదించారు. జోయా 12వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె తల్లిద ండ్రుల ఫిర్యాదు మేరకు ముబ్రా ఠాణాలో కిడ్నాప్ కేసుగా నమోదు చేశామని ఇక్కడికి వచ్చిన సంబంధింత ఠాణా కానిస్టేబుల్ తెలిపాడు. బాలికను హైదరాబాద్‌లోని సీడబ్ల్యూసీకి అప్పగించి వారి ద్వారా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. అదృశ్యమైన బాలిక క్షేమంగా దొరకడంతో జోయా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
బాలికపై గ్యాంగ్‌రేప్.. ఆరుగురి అరెస్టు
ఓ బాలికపై కొందరు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబై శివార్లలోని చెంబూరు ప్రాంతంలోగల ఓ హౌసింగ్ సొసైటీలో తెల్లవారుజామున జరిగింది. ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు బాలికకు తెలిసున్నవాళ్లే. సామూహిక అత్యాచారం జరిగిన భవన కేర్‌టేకర్ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం కూడా గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను ఘట్కోపర్ ప్రాంతంలోని రాజావాడి ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. -
తండ్రి జైలు నుంచి విడుదల కావాలని...
ఒంగోలు: చిన్నపాటి గొడవలో తండ్రి జైలుపాలయ్యాడు. తమ ఇలవేల్పు అయిన తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చి మొక్కుకుంటే తండ్రి జైలు నుంచి బయటపడతాడని భావించిన ఆ 13 ఏళ్ల చిన్నారి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రెలైక్కి ముంబయి నుంచి తిరుపతికి వచ్చింది. అక్కడ నుంచి కాలినడకన కొండెక్కి స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రైలులో వెళ్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ముంబయికి చెందిన విజయవిఠల్ కథమ్ పప్పుధాన్యాలు తయారు చేసే కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన గొడవలో విజయవిఠల్ కథమ్ జైలు పాలయ్యాడు. అతని కుమార్తె అక్షద విజయకథమ్ (13) 8వ తరగతి చదువుతోంది. తన పదేళ్ల వయసులో తండ్రితో కలిసి కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. మళ్లీ ఆస్వామిని వేడుకుంటే తన తండ్రి జైలు నుంచి విడుదలవుతాడ న్న నమ్మకంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నాలుగు రోజుల క్రితం ముంబయి నుంచి రైలులో నుంచి తిరుపతి చేరుకుంది. కాలినడకన వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని కొండపై మూడు రోజులు ఉండి తిరుగు ప్రయాణమైంది. ఏ రైలు ఎక్కిందో..ఏమోగానీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్లో మంగళవారం సాయంత్రం దిగింది. నీరసంగా ప్లాట్‌ఫాంపై ఉన్న ఆ బాలికను రైల్వే జీఆర్పీ పోలీసులు గుర్తించి ఒంగోలు జీఆర్పీ సీఐ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. బాలికను ఒంగోలు రైల్వేస్టేషన్‌కు మంగళవారం రాత్రి తీసుకొచ్చారు. బుధవారం బాలల సంక్షేమ మండలి చైర్మన్ ముందు హాజరుపరిచి బాలసదన్‌లో చేర్పించారు. బాలిక చెప్పిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. -
కాశ్మీర్ వరదలు కలిపాయి!
సాధారణంగా వరదలు మనుషుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తాయి. కాని జలప్రళయం ఓ చిన్నారిని తనవారికి చేరువ చేసింది. కాశ్మీర్ వరదలు ఓ చిన్నారికి చెర నుంచి విముక్తి కల్పించాయి. ఓ మంచి వ్యక్తి సాయంతో సదరు బాలిక సొంతగూటికి చేరుకోగలిగింది. మేఘ అనే ఆరేళ్ల బాలిక ముంబైలోని బాంద్రా ప్రాంతం నుంచి ఏడాది క్రితం కిడ్నాపయింది. మేఘను ఎత్తుకుపోయిన దుండగుడు ఆమెను జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ తీసుకుపోయాడు. అక్కడ ఆమెతో బలవంతంగా భిక్షాటన చేయించాడు. సెప్టెంబర్ లో శ్రీనగర్ లో వరదలు సంభవించినప్పుడు చాలా మంది గల్లంతయ్యారు. వరదల్లో గల్లంతైన బాలిక అనుకుని మేఘను దాల్ గేట్ ప్రాంత వాసులు చేరదీశారు. ఇమామ్ ఆషిక్ ఇలాహి అనే వ్యక్తి ఆమె బాధ్యత తీసుకున్నాడు. మేఘను జహాన్ ఆరా అనే మహిళ ఇంట్లో ఉంచి పోలీసులకు సమాచారం అందించాడు. ఆమె ఫోటోలు ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశాడు. ఈ ప్రయత్నాలు ఫలించడంతో రెండు వారాల తర్వాత మేఘ తనవారిని చేరుకుంది. మేఘ గురించి తెలుసుకున్న ఆమె తాతయ్య రమేష్ మదన్ ఠాకూర్.. శ్రీనగర్ కు వచ్చారు. వివరాలు అన్ని నిర్ధారించుకున్న తర్వాత మేఘను ఆమె తాతయ్యకు పోలీసులు అప్పగించారు. నజీర్ అహ్మద్ అనే వ్యక్తి తనను ఎత్తుకొచ్చాడని మేఘ తెలిపింది. ముందుగా యూపీ, కోల్‌కతా తీసుకెళ్లాడని తర్వాత శ్రీనగర్ తీసుకొచ్చాడని వెల్లడించింది. భిక్షాటన చేయాలని ఒత్తిడి చేసేవాడని తెలిపింది. కాగా, మేఘ గురించి ఎవరూ రాకపోతే తమదగ్గరే ఉంచుకోవాలనుకున్నామని జహాన్ ఆరా తెలిపింది. తన నలుగురు పిల్లలతో ఆమె కలిసిపోయిందని వెల్లడించింది. మళ్లీ తనవారిని కలుసుకోవడంతో చిన్నారి మేఘ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.