ఫేస్ బుక్, ట్విటర్ ను హ్యాక్ చేసి.. బ్లాక్ మెయిల్: వీణామాలిక్ | Veena Malik accuses Indian manager of blackmail | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్, ట్విటర్ ను హ్యాక్ చేసి.. బ్లాక్ మెయిల్: వీణామాలిక్

Published Mon, Jan 6 2014 2:00 AM | Last Updated on Sat, Aug 25 2018 6:49 PM

ఫేస్ బుక్, ట్విటర్ ను హ్యాక్ చేసి.. బ్లాక్ మెయిల్: వీణామాలిక్ - Sakshi

ఫేస్ బుక్, ట్విటర్ ను హ్యాక్ చేసి.. బ్లాక్ మెయిల్: వీణామాలిక్

సోషల్ మీడియా అకౌంట్లతో తలెత్తే ఇబ్బందులు సామాన్యులకే కాదు..సెలబ్రీటిలకు కూడా తప్పడం లేదు. డబ్బులు, చీప్ పాపులారిటీ కోసం తన మాజీ మేనేజర్ ప్రశాంత్ సింగ్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని పాకిస్థానీ మోడల్, బాలీవుడ్ తార వీణా మాలిక్ ఆరోపించారు. తన ఫేస్ బుక్, ట్విటర్ అకౌంట్లను హ్యాక్ చేసి వివాదస్పద ఫోటోలను పోస్ట్ చేస్తున్నారని ప్రశాంత్ పై వీణా మాలిక్ నిప్పులు చెరిగారు. తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. అతనో అబద్దాల కోరు అని వీణా అన్నారు. బాయ్ ఫ్రెండ్ అంటూ ఆయన చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు వీణా మాలిక్ ఖండించారు. ఆయన తనకు సోదరుడు లాంటి వాడు. తనను ఆయన కూడా సోదరిగానే చూశాడు అని వీణా మాలిక్ అన్నారు. 
 
దుబాయ్ వ్యాపారవేత్త అసద్ బషీర్ ఖాన్ కట్టక్ ను వివాహామాడిన తర్వాత తాను బిజీగా మారాను. తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ కు సంబంధించిన పాస్ వర్డ్స్ ను మార్చడం మరిచిపోయాను అని అన్నారు. సింగ్ భారతీయుడు. తన వద్ద 10 వేల రూపాయలకు ఉద్యోగం చేసేవాడు. అతను తన పరిధిలోనే ఉండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్వాన్స్ గా సింగ్ కు 3 లక్షల రూపాయలు చెల్లించానన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని అన్నారు.  ఇస్లామాబాద్ లోన జియో న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ.. ప్రస్తుతం  వైవాహిక జీవితంతో సంతోషంగా ఉన్నాను. తనను కాపాడుకోవడం ఎలానో తనకు భర్తకు తెలుసు అని వీణా ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement