Prashant Singh
-
రిమోట్‌తో మాట్లాడే గణనాథుడు
-‘ఖని’లో పాలిటెక్నిక్ స్టూడెంట్ వినూత్న ప్రయోగం కోల్‌సిటీ మనం హాలో అంటే తిరిగి హాలో అంటాడు.. కళ్ల కదిలించడమే కాదు.. మూయడం, తెరవడం కూడా చేస్తాడు. ఓంకార శ్లోకాన్ని చదివి వినిపిస్తాడు. చేతిలో లడ్డును గుండ్రంగా తిప్పుతాడు.. ఇవి కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో వెలసిన విఘ్ననాయకుడి ప్రత్యేకతలు.. అయితే, ఇవన్నీ ఈ గణేషుడు రిమోట్ సహాయంతో మాత్రమే చేస్తాడు. ఇన్ని ప్రత్యేకతలున్న వినాయకుడిని స్థానిక తిలక్‌నగర్‌కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి బోశెట్టి భగత్‌ప్రశాంత్ తయారు చేశాడు. రెండు అడుగుల ఎత్తు, 10 కిలోల బరువుతో ఉన్న ఈ గణనాథున్ని బంగారు రంగులతో అలరిస్తున్నాడు. గోల్డ్ గణేష్‌గా పిలుస్తున్న ఈ విగ్రహానికి అనుసంధానం చేసిన రిమోట్ బటన్స్ నొక్కితే ఈ వినాయకుడు పైన చెప్పినవన్నీ చేస్తున్నాడు. అంతేకాదు వినాయక విగ్రహం ముందు ఏర్పాటు చేసిన మూషిక కళ్లలో వెలుగులు వస్తాయి. ఇలా వినూత్నంగా ఉండేలా భగత్‌ప్రశాంత్ విగ్రహాన్ని కేవలం రూ.500లతో తయారు చేశాడు. ఈ వినాయకుడిని చూసేందుకు స్థానికులు భగత్ ఇంటికి వెళ్తున్నారు. వినాయక చవితి పండుగలో డిఫరెంట్‌గా ఉండాలని రిమోట్ కంట్రోల్‌తో మాట్లాడే వినాయకుడిని తయారు చేసినట్లు బోశెట్టి భగత్‌ప్రశాంత్ తెలిపారు. -
ఫేస్ బుక్, ట్విటర్ ను హ్యాక్ చేసి.. బ్లాక్ మెయిల్: వీణామాలిక్
సోషల్ మీడియా అకౌంట్లతో తలెత్తే ఇబ్బందులు సామాన్యులకే కాదు..సెలబ్రీటిలకు కూడా తప్పడం లేదు. డబ్బులు, చీప్ పాపులారిటీ కోసం తన మాజీ మేనేజర్ ప్రశాంత్ సింగ్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని పాకిస్థానీ మోడల్, బాలీవుడ్ తార వీణా మాలిక్ ఆరోపించారు. తన ఫేస్ బుక్, ట్విటర్ అకౌంట్లను హ్యాక్ చేసి వివాదస్పద ఫోటోలను పోస్ట్ చేస్తున్నారని ప్రశాంత్ పై వీణా మాలిక్ నిప్పులు చెరిగారు. తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. అతనో అబద్దాల కోరు అని వీణా అన్నారు. బాయ్ ఫ్రెండ్ అంటూ ఆయన చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు వీణా మాలిక్ ఖండించారు. ఆయన తనకు సోదరుడు లాంటి వాడు. తనను ఆయన కూడా సోదరిగానే చూశాడు అని వీణా మాలిక్ అన్నారు. దుబాయ్ వ్యాపారవేత్త అసద్ బషీర్ ఖాన్ కట్టక్ ను వివాహామాడిన తర్వాత తాను బిజీగా మారాను. తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ కు సంబంధించిన పాస్ వర్డ్స్ ను మార్చడం మరిచిపోయాను అని అన్నారు. సింగ్ భారతీయుడు. తన వద్ద 10 వేల రూపాయలకు ఉద్యోగం చేసేవాడు. అతను తన పరిధిలోనే ఉండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్వాన్స్ గా సింగ్ కు 3 లక్షల రూపాయలు చెల్లించానన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఇస్లామాబాద్ లోన జియో న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ.. ప్రస్తుతం వైవాహిక జీవితంతో సంతోషంగా ఉన్నాను. తనను కాపాడుకోవడం ఎలానో తనకు భర్తకు తెలుసు అని వీణా ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. -
బాలీవుడ్ నటిపై మాజీ ప్రియుడి కేసు నమోదు
వివాదాలకు కేంద్ర బిందువులాంటి బాలీవుడ్ తార, పాకిస్థానీ మోడల్ వీణామాలిక్ పై మాజీ ప్రియుడు ప్రశాంత్ సింగ్ కేసు నమోదు చేశాడు. ముంబైలోని ఆరేయ్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 507 కింద వీణాపై కేసు నమోదైంది. ఆరేయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్డెన్ వ్యూ బిల్లింగ్ లో వీణా, ప్రశాంత్ లిద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఆ సమయంలో వీణా ఖర్చులన్ని ప్రశాంత్ భరించాడు. అయితే వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ వివాదానికి కారణమైంది. ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎవరికైనా చెబితే.. అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు పెడుతానని తనను వీణామాలిక్ బెదిరించింది అని ప్రశాంత్ వెల్లడించారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వీణా మాలిక్ పై ముందు జాగ్రత్త చర్యగా కేసు నమోదు చేశానన్నారు. దుబాయ్ చెందిన వ్యాపారవేత్తను వివాహమాడినట్టు వీణా మాలిక్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖులకు విందును భారీ ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్న తరుణంలో కేసు నమోదవ్వడం వీణాకు చేదు అనుభవంగా మారింది.