బాలీవుడ్ నటిపై మాజీ ప్రియుడి కేసు నమోదు
బాలీవుడ్ నటిపై మాజీ ప్రియుడి కేసు నమోదు
Published Wed, Jan 1 2014 4:36 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
వివాదాలకు కేంద్ర బిందువులాంటి బాలీవుడ్ తార, పాకిస్థానీ మోడల్ వీణామాలిక్ పై మాజీ ప్రియుడు ప్రశాంత్ సింగ్ కేసు నమోదు చేశాడు. ముంబైలోని ఆరేయ్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 507 కింద వీణాపై కేసు నమోదైంది. ఆరేయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్డెన్ వ్యూ బిల్లింగ్ లో వీణా, ప్రశాంత్ లిద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఆ సమయంలో వీణా ఖర్చులన్ని ప్రశాంత్ భరించాడు. అయితే వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ వివాదానికి కారణమైంది.
ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎవరికైనా చెబితే.. అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు పెడుతానని తనను వీణామాలిక్ బెదిరించింది అని ప్రశాంత్ వెల్లడించారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వీణా మాలిక్ పై ముందు జాగ్రత్త చర్యగా కేసు నమోదు చేశానన్నారు.
దుబాయ్ చెందిన వ్యాపారవేత్తను వివాహమాడినట్టు వీణా మాలిక్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖులకు విందును భారీ ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్న తరుణంలో కేసు నమోదవ్వడం వీణాకు చేదు అనుభవంగా మారింది.
Advertisement
Advertisement