మసాలా సినిమాలకు గుడ్ బై: వీణా మాలిక్ | Pakistan actress Veena Malik retires from commercial film industry | Sakshi
Sakshi News home page

మసాలా సినిమాలకు గుడ్ బై: వీణా మాలిక్

Published Mon, Jan 27 2014 2:50 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మసాలా సినిమాలకు గుడ్ బై: వీణా మాలిక్ - Sakshi

మసాలా సినిమాలకు గుడ్ బై: వీణా మాలిక్

పాకిస్థాన్ మోడల్, బాలీవుడ్ తార వీణా మాలిక్ అభిమానులకు చేదు వార్త అందించింది. కమర్షియల్ సినిమాల్లో ఇక నుంచి నటించను. రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అని ఆదివారం ప్రకటించింది. అయితే మత, సామాజిక సందేశాలున్న చిత్రాల్లో నటిస్తాను అని వీణా వెల్లడించింది.

మక్కాలో ప్రార్థన (ఉమ్రా) నిర్వహించిన తర్వాత మసాలా చిత్రాలకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలిపింది. ఇక నుంచి చిత్రాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాను అని వెల్లడించింది.  గత సంవత్సరం దుబాయ్ లోని వ్యాపారవేత్త అసద్ బషీర్ ను వీణా మాలిక్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవల భర్త, కుటుంబ సభ్యులతో కలిసి మక్కాలో పూజలు నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement