బాలీవుడ్ తెరపై పాకిస్థానీ అందాలు!! | pakistani beauties reign over bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ తెరపై పాకిస్థానీ అందాలు!!

Published Sat, Sep 6 2014 12:49 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ తెరపై పాకిస్థానీ అందాలు!! - Sakshi

బాలీవుడ్ తెరపై పాకిస్థానీ అందాలు!!

బాలీవుడ్.. కోటి కలల సామ్రాజ్యం. వెండితెర మీద వెలిగిపోవాలని, కోట్ల కొద్దీ డబ్బు సంపాదించుకోవాలని చాలామంది ఆశపడుతుంటారు. గ్లామర్ ఒలికిస్తే చాలు.. హిందీ తెరను ఏలొచ్చని వచ్చి వాలిపోతుంటారు. హీరోయిన్గా కాకపోయినా.. కనీసం ఐటెం సాంగుల్లో అయినా కనిపించి పేరు సంపాదించాలని భావించేవాళ్లకూ కొదవ లేదు. అయితే.. ఇలా వచ్చేవాళ్లలో ఇప్పుడు పొరుగుదేశం పాకిస్థానీ పాపలు ఎక్కువ మంది ఉంటున్నారట. ఎటూ ఎంతోకొంత హిందీ వచ్చి ఉండటం వారికి అడ్వాంటేజ్ అవుతోంది. ఇతర సమస్యలు ఎన్ని ఉన్నా.. పాకిస్థానీ అందగత్తెలు వెల్లువలా వస్తూనే ఉన్నారు. ఇలా వచ్చేవాళ్లను ఒక్కసారి చూస్తే..

హుమైమా మాలిక్:
పాకిస్థానీ సినీ పరిశ్రమ నుంచి ఇటీవలి కాలంలో వచ్చిన నటి హుమైమా. ఇప్పుడు ఈమె ఇమ్రాన్ హష్మితో కలిసి రాజా నట్వర్లాల్ చిత్రంలో చేసింది. పాకిస్థానీ నటీమణుల్లో ఎక్కువ సంపాదించేది ఈమే అని చెబుతారు. సీరియల్ కిస్సర్గా పేరున్న హష్మితో ఈమె కొన్ని హాట్ సీన్లు బాగానే పండించిందట.

సారా లోరెన్:
మోనాలిసా పేరుతో ముందుగా ప్రాచుర్యం పొందిన సారా.. 2003లోనే రబియా జిందా రహేగీ అనే టీవీ సీరియల్లో నటించింది. ఆ తర్వాత కూడా వరుసపెట్టి మెహర్ బానో ఔర్ షా బానో, శాండల్, రియాసత్, దుపట్టా, ఉమ్రావో జానే అదా సీరియళ్లలో కూడా చేసింది. 'కజరారే'తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అది ఫ్లాపయినా, నిషా, మర్డర్ 3 లాంటి సినిమాలతో తానేంటో చూపించింది.

మీరా:
పాకిస్థాన్ నుంచి దిగుమతి అయ్యి.. బాలీవుడ్ తలుపు తట్టిన మరో నటి మీరా. తన తొలి సినిమా నజర్లోనే ఆమె విశ్వరూపం చూపించింది. ఆ సినిమాలే అష్మిత్ పటేల్తో కలిసి చేసిన మేరే దిల్ మే పాటతో మీరా అంటే ఏంటో అందరికీ తెలిసింది. అయితే ఆ తర్వాత పలు వివాదాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఆమెపై ఓ అరెస్టు వారెంటు కూడా జారీ అయ్యిందట.

వీణా మాలిక్:
పాకిస్థానీ క్రికెటర్ మహ్మద్ ఆసిఫ్తో సంబంధాలతో వార్తల్లోకి వచ్చిన వీహా మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం ప్రపంచానికి అంతటికీ తెలిసింది. ఇక బిగ్ బాస్ గొడవతో ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. అష్మిత్ పటేల్తో ప్రేమ వ్యవహారం కూడా వార్తల్లోకి ఎక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement