బాలీవుడ్ ప్రకటన
ముంబై: ఇక నుంచి బాలీవుడ్ తెరక్కెకించబోయే ఏ చిత్రాల్లోను పాకిస్తాన్ నటులను తీసుకోబోమంటూ బాలీవుడ్ శనివారం సంచలన ప్రకటన చేసింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడితో బాలీవుడ్ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో జరిగిన కీలక భేటీలో.. ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలకు అంగీకారం కుదిరింది. ఉడీ దాడిపై బాలీవుడ్ నటులు అందరూ పాక్ చర్యలను ఖండించినా, బాలీవుడ్‌లో పనిచేస్తున్న పాక్ నటులు మాత్రం దాడిపై నోరు మెదపలేదు.
దీంతో పాక్ న టులను బహిష్కరించాలని ఎంఎన్‌ఎస్ అంటోంది. ఎంఎన్‌ఎస్ డిమాండ్ల మేరకు ఈ చిత్రంలో నటించిన ఐశ్వర్యరాయ్, రణబీర్‌కపూర్, అనుష్కశర్మలు సైనిక సంక్షేమ నిధికి రూ. 5 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో పాకిస్తాన్‌కు చెందిన నటుడు ఫవద్‌ఖాన్ 4 నిమిషాల పాటు కనిపించనున్నారు.
పాక్ నటులను తీసుకోం!
Published Sun, Oct 23 2016 1:38 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement