
ఇస్లామాబాద్: ఒకప్పటి క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్‌ను స్ఫూర్తిగా తీసుకొని చెప్పిన డైలాగ్ ఇది. 2014లో పాకిస్థాన్ టెలివిజన్ (పీ టీవీ) ప్రధాన కార్యాలయంపై దాడుల కేసులో ఇమ్రాన్‌ఖాన్ మంగళవారం బెయిల్ వచ్చింది. ఈ సందర్భంగా బాలీవుడ్ సినిమా ’మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమాలోని ప్రముఖ డైలాగ్ ’మై నేమ్ ఈజ్ ఖాన్.. ఐ యామ్ నాట్ టెర్రరిస్ట్ (నా పేరు ఖాన్.. నేను ఉగ్రవాదిని కాదు)ను ఇమ్రాన్ ఖాన్ ఉటంకించారు.
‘నాపేరు ఖాన్, నేను ఉగ్రవాదిని కాదు. నేను సత్యవాదిని, మంచి వ్యక్తిని అని సుప్రీంకోర్టు పేర్కొంది’ అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ అభ్యర్థనను ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) ఆమోదించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఇమ్రాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను ఎదుర్కొన్న కోర్టు విచారణలో షరీఫ్ సగం కూడా ఎదుర్కోలేదని, తన జీవితంలో ఎవరి సొమ్మును దోచుకోలేదని ఇమ్రాన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment