-‘ఖని’లో పాలిటెక్నిక్ స్టూడెంట్ వినూత్న ప్రయోగం
కోల్‌సిటీ
మనం హాలో అంటే తిరిగి హాలో అంటాడు.. కళ్ల కదిలించడమే కాదు.. మూయడం, తెరవడం కూడా చేస్తాడు. ఓంకార శ్లోకాన్ని చదివి వినిపిస్తాడు. చేతిలో లడ్డును గుండ్రంగా తిప్పుతాడు.. ఇవి కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో వెలసిన విఘ్ననాయకుడి ప్రత్యేకతలు.. అయితే, ఇవన్నీ ఈ గణేషుడు రిమోట్ సహాయంతో మాత్రమే చేస్తాడు. ఇన్ని ప్రత్యేకతలున్న వినాయకుడిని స్థానిక తిలక్‌నగర్‌కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి బోశెట్టి భగత్‌ప్రశాంత్ తయారు చేశాడు. రెండు అడుగుల ఎత్తు, 10 కిలోల బరువుతో ఉన్న ఈ గణనాథున్ని బంగారు రంగులతో అలరిస్తున్నాడు. గోల్డ్ గణేష్‌గా పిలుస్తున్న ఈ విగ్రహానికి అనుసంధానం చేసిన రిమోట్ బటన్స్ నొక్కితే ఈ వినాయకుడు పైన చెప్పినవన్నీ చేస్తున్నాడు. అంతేకాదు వినాయక విగ్రహం ముందు ఏర్పాటు చేసిన మూషిక కళ్లలో వెలుగులు వస్తాయి. ఇలా వినూత్నంగా ఉండేలా భగత్‌ప్రశాంత్ విగ్రహాన్ని కేవలం రూ.500లతో తయారు చేశాడు. ఈ వినాయకుడిని చూసేందుకు స్థానికులు భగత్ ఇంటికి వెళ్తున్నారు. వినాయక చవితి పండుగలో డిఫరెంట్‌గా ఉండాలని రిమోట్ కంట్రోల్‌తో మాట్లాడే వినాయకుడిని తయారు చేసినట్లు బోశెట్టి భగత్‌ప్రశాంత్ తెలిపారు.
రిమోట్‌తో మాట్లాడే గణనాథుడు
Published Sun, Sep 4 2016 9:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
Advertisement