ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తానని.. | Murder Case Mystery Reveals in PSR Nellore | Sakshi
Sakshi News home page

స్నేహితుడే కిరాతకుడు

Published Thu, Jan 17 2019 1:33 PM | Last Updated on Thu, Jan 17 2019 1:33 PM

Murder Case Mystery Reveals in PSR Nellore - Sakshi

హత్య కేసులో నిందితులు జిమ్‌ రవి, సూర్య

నెల్లూరు , నాయుడుపేటటౌన్‌: తనకు సంబంధించిన అశ్లీల వీడియోలను తనకే తెలియకుండా డౌన్‌లోడ్‌ చేసుకుని డబ్బుల కోసం బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని  స్నేహితుడిని పథకం ప్రకారం అతి కిరాతకంగా హత్య చేశాడని నాయుడుపేట ఇన్‌చార్జి సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు. బాలయపల్లి మండలం చిలమనూరు గ్రామ తిప్ప సమీపంలో అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన జడపల్లి శ్రీనివాసులు (25) ఈ నెల 8న హత్యకు గురైన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మృతుడి స్నేహితుడిగా గుర్తిం చారు. అతనితో పాటు మరోక వ్యక్తి కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్ట్‌ చేసి హత్యకు సంబంధించి వివరాలను వివరించారు. 

చిలమనూరు తిప్ప సమీపంలోని అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన జడపల్లి శ్రీనును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన వైనం ఈ నెల 9న వెలుగుచూసింది. దీనిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. గూడూరు ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసచారి సారథ్యంలో సీఐతో పాటు బాలాయపల్లి ఎస్సై పీ నరసింహరావు, ఐడీ పార్టీ పోలీసులతో కలిసి హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం శ్రీశ్రీనగర్‌కు చెందిన జూటూరి తులసిరామ్‌ అలియాస్‌ జిమ్‌ రవి కోవూరులో జిమ్‌ నిర్వహిస్తున్నాడు. అతనికి జడపల్లి శీను స్నేహితుడు. అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండేవారు. జిమ్‌ రవి ఫోన్‌లో ఒంగోలు చెందిన ఓ యువతితో శారీరకంగా కలిసి ఉన్న అశ్లీల వీడియోలను తీసుకున్నాడు.

ఘటన స్థలంలో జాగిలంతో దర్యాప్తు, వేలి ముద్రలు సేకరిస్తున్న పోలీసులు శ్రీను (ఫైల్‌)
ఈ వీడియోలను శీను తన ఫోన్‌లోకి డౌన్‌ లోడు చేసుకున్నాడు. ఆ వీడియోలను శీను దగ్గర పెట్టుకుని వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తానని, ఇతరులకు చూపిస్తానని బెదరిస్తూ డబ్బులు ఇవ్వాలని  జిమ్‌ రవి బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. స్నేహితుడే తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తుండడంతో అతన్ని హత్య చేయాలని పథకం రూపొందించుకున్నాడు. ఈ క్రమంలో జిమ్‌ రవి మరో స్నేహితుడైన కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామానికి చెందిన పాటిబండ్ల మాలకొండయ్య అలియాస్‌ సూర్యతో కలిసి ఈ నెల 8న శీనుకు ఫోన్‌ చేసి చిలమనూరు తిప్ప సమీపంలో ఉన్నామని చెప్పి పిలిపించారు. వారు తెచ్చిన మద్యంను ముగ్గురు కలిసి తాగారు. శీను మద్యం మత్తులో ఉండడంతో ఇదే అదనుగా భావించి జిమ్‌ రవి, సూర్య వారు తెచ్చుకున్న ఇనుప రాడ్‌లతో శీను తలపై కోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సెల్‌ఫో న్‌ కాల్‌ డిటైల్స్‌ ఆధారంగా పలు కోణాల్లో దర్యా ప్తు ముమ్మరం చేశారు.

నిందితులైన జిమ్‌ రవి, సూర్య పోలీసులకు పట్టుబడితే కొడతారనే భయంతో బాలయపల్లి తహసీ ల్దార్‌ వద్దకు వెళ్లి లొంగిపోయా రు. వారు చెప్పి న వివరాలను నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను నాయుడుపేట సీఐకు అప్పగించారు. ఈ మేరకు హత్య కేసులో నిందితులైన జిమ్‌ రవి, సూర్యను బుధవారం అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. శీను హత్య కేసును వారం రోజుల్లోనే ఛేదించి,  నిందితులను అరెస్ట్‌ చేయడంపై సీఐతో పాటు బాలాయపల్లి ఎస్సై సీ నరసింహరావు, ఐడీ పార్టీ ఏఎస్సై పీ శ్రీనివాసులురెడ్డి, హెడ్‌ కానిస్టేబుళ్లు షేక్‌ కరీమ్, పీ కృష్ణారెడ్డి, హోంగార్డు దారా వెంకి, బాలాయపల్లి పోలీసు సిబ్బందికి నగదు రివార్డుకు జిల్లా ఎస్పీకు సిఫారసు చేస్తామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement