![Man Blackmailing Married Woman In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/29/Man-Blackmailing-Married-Wo.jpg.webp?itok=ppV3V5Gx)
ప్రతీకాత్మక చిత్రం
అమీర్‌పేట(హైదరాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోర్కెలు తీర్చుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ సైదులు సమాచారం మేరకు... ఏపీలోని మచిలీపట్నంకు చెందిన పార్వతి టైలరింగ్ చేస్తూ బీకేగూడ ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటోంది. భర్తతో విడిపోయిన ఆమె కూతురుతో కలిసి రెండు సంవత్సరాల క్రితం చందానగర్‌లో ఉన్న సమయంలో అమర్‌తేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని నీ కూతురుని కూడా బాగా చూసుకుంటానని నమ్మించి ఆరు నెలలపాటు ఆమెతో సహజీవనం చేశాడు.
చదవండి: మహిళతో ఒప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా
అయితే అమర్‌తేజకు సైతం వివాహం జరిగినట్లు తెలియడంతో ఆయనను నిలిదీసింది. దీన్ని మనుసులో పెట్టుకుని ఆమెను వేధింస్తుండటంతో బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరియీ కౌన్సిలింగ్ చేసి పంపారు. అయినా అతడిలో మార్పు రాలేదు. దీంతో బీకేగూడకు వచ్చి ఉంటుంది. గతంలో ఆమెతో ఉన్న సమయంలో దిగిన ఫొటోలను చూపించి తనవద్దకు రావాలని, లేదంటే ఫొటోలను మీ బంధువులకు పంపుతానని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment