అరెస్టయిన విజయకుమార్, యశోధ
సాక్షి, చెన్నై: ఎమ్మెల్యేపై వస్తున్న ఫిర్యాదులను సీఎం దృష్టికి వెళ్లకుండా చూడడానికి రూ. 25 లక్షలు డిమాండ్ చేసిన నకిలీ పోలీసు అధికారి, అతడి భార్యను తిరువళ్లూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గత 25న తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి తాను హోంశాఖలో డీఎస్పీనని పరిచయం చేసుకున్నాడు. తిరుత్తణిలో అక్రమాలకు ఎమ్మెల్యే పాల్పడుతున్నట్టు వివరిస్తూ, ఇప్పటికే కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. సంబంధిత ఫిర్యాదులు సీఎందృష్టికి వెళితే ఎమ్మెల్యే పదవిపోవడం ఖాయం. అయితే తమకు రూ.25 లక్షలు ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి ఫిర్యాదులు వెళ్లకుండా చూస్తామని చెప్పారు.
చదవండి: యోగి కోసం.. రంగంలోకి ఫుల్‌టైమ్ సంఘ్ కార్యకర్తలు
వెల్లాతికుళం ఎమ్మెల్యేపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే తామే పరిష్కరించామని కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ తిరువళ్లూరు ఎస్పీ వరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నకిలీ పోలీసు అధికారి విజయకుమార్, యశోదను అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ గుర్తింపు కార్డు, రూ.10వేల నగదు, కారును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో వీరు అంబత్తూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరు గతంలో వెల్లాతికుళం ఎమ్మెల్యే మార్కండేయన్‌ను సైతం బెదిరించినట్టు నిర్ధారించారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు
Comments
Please login to add a commentAdd a comment