DMK MLA
-
సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు
సాక్షి, చెన్నై: ఎమ్మెల్యేపై వస్తున్న ఫిర్యాదులను సీఎం దృష్టికి వెళ్లకుండా చూడడానికి రూ. 25 లక్షలు డిమాండ్ చేసిన నకిలీ పోలీసు అధికారి, అతడి భార్యను తిరువళ్లూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గత 25న తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి తాను హోంశాఖలో డీఎస్పీనని పరిచయం చేసుకున్నాడు. తిరుత్తణిలో అక్రమాలకు ఎమ్మెల్యే పాల్పడుతున్నట్టు వివరిస్తూ, ఇప్పటికే కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. సంబంధిత ఫిర్యాదులు సీఎందృష్టికి వెళితే ఎమ్మెల్యే పదవిపోవడం ఖాయం. అయితే తమకు రూ.25 లక్షలు ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి ఫిర్యాదులు వెళ్లకుండా చూస్తామని చెప్పారు. చదవండి: యోగి కోసం.. రంగంలోకి ఫుల్‌టైమ్ సంఘ్ కార్యకర్తలు వెల్లాతికుళం ఎమ్మెల్యేపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే తామే పరిష్కరించామని కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ తిరువళ్లూరు ఎస్పీ వరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నకిలీ పోలీసు అధికారి విజయకుమార్, యశోదను అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ గుర్తింపు కార్డు, రూ.10వేల నగదు, కారును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో వీరు అంబత్తూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరు గతంలో వెల్లాతికుళం ఎమ్మెల్యే మార్కండేయన్‌ను సైతం బెదిరించినట్టు నిర్ధారించారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. చదవండి: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి
-
బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని అర్ధరాత్రి ఆడి కారు రోడ్డు ప్రమాదం ఏడుమంది జీవితాలను కబళించగా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతీ యువకులకు అదే చిట్టచివరి జాలీ రైడ్ అయ్యింది. సోమవారం అర్ధరాత్రి అనంతరం 1:35 గంటల సమయంలో కోరమంగళ మంగళ కళ్యాణమంటం వద్ద ఖరీదైన ఆడి కారు వేగంగా దూసుకెళ్లి ఫుట్‌పాత్‌పై కరెంటు పోల్‌ను ఢీకొన్న దుర్ఘటనలో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న కరుణాసాగర్ (28), ఆయనకు కాబోయే భార్య బిందు (24), వారి స్నేహితులు ఇషికా (21), డాక్టర్ ధనూషా (21), అక్షయ్ గోయల్, ఉత్సవ్, రోహిత్ (23) దుర్మరణం చెందారు. కరుణాసాగర్ హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై.ప్రకాష్ ఏకైక తనయుడు. చదవండి: నెల క్రితమే తల్లి మృతి: బాధను దిగమింగుకుని డ్యూటీకి వెళ్తుండగా.. సీటు బెల్టులు పెట్టుకోలేదు .. బెలూన్లు తెరుచుకోలేదు ఆ సమయంలో ఎవరూ సీట్ బెల్ట్ ధరించకపోవడంతో పాటు కారు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకపోవడంతో మృత్యువు కబళించినట్లు అంచనా. ఏ కారో కూడా గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైంది. అతివేగంతో డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని నగర ట్రాఫిక్ విభాగ జాయింట్ పోలీస్ కమిషనర్ రవికాంతేగౌడ తెలిపారు. మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. కారులో 5 మంది కూర్చోవచ్చు, కానీ 7 మంది ఉన్నారు. ఎవరూ కూడా సీట్‌బెల్డ్ పెట్టుకోలేదు. సీట్‌బెల్ట్ ధరించినట్లతే బతికేవారు. ఆరుమంది ఘటనాస్థలంలోనే మృతిచెందగా ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఇద్దరు తమిళనాడు, ఒకరు కేరళ, మరొకరు మహారాష్ట్రకు చెందినవారు. ఐదుమంది బెంగళూరులో పీజీ హాస్టళ్లలో ఉంటున్నారు. వీరు ఏయే ఉద్యోగాలు చేస్తున్నారనేది విచారిస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మద్యం సేవించారా అనేది పోస్టుమార్టంలో తెలుస్తుంది అని వివరించారు. ప్రాణస్నేహితులు మృతుల్లో ఐదుగురు కరుణాసాగర్‌కు ప్రాణస్నేహితులు. ధనూషా దంతవైద్యురాలు, ఇషికా ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి, హుబ్లీకి చెందిన రోహిత్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం కోసం బెంగళూరులో పీజీలో ఉంటున్నాడు. హర్యానా, కేరళకు చెందిన గోయల్, ఉత్సవ్లు కూడా కోరమంగళలో పీజీలో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఐదుమంది కలిసివెళ్లేవారు. మృతదేహాలను సెయింట్‌జాన్స్ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే, బంధుమిత్రులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. వేగంగా డ్రైవింగ్ సోమవారం రాత్రి 10.35 సమయంలో కరుణాసాగర్ అతివేగంగా కారుడ్రైవింగ్ చేస్తూ వెళ్లాడు. కోరమంగల అపోలో ఆసుపత్రి వద్ద చెక్‌పోస్టులో కారును పోలీసులు ఆపి ఎందుకు వేగంగా వెళ్తున్నారని ప్రశ్నించారు. ఇంటికి వెళుతున్నామని కరుణాసాగర్ తెలిపాడు. నైట్ కర్ఫ్యూ ఉంది, నిదానంగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ఆ తరువాత అర్ధరాత్రి పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్తూ అత్యంత వేగంగా డ్రైవింగ్ చేసినట్లు భావిస్తున్నారు. ఘటనాస్థలి వద్ద ఉన్న ఒక సీసీ కెమెరాలో ప్రమాదం పాక్షికంగా రికార్డయింది. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే కారు ఢీకొట్టిన వేగానికి వెనుక మధ్యలో కూర్చున్న యువతి ఎగిరివచ్చి ముందు అద్దంలో చిక్కుకుందని ప్రత్యక్షసాక్షి తెలిపారు. ఓ క్యాబ్ డ్రైవరు సతీష్ కారు పార్కింగ్ చేసి రూమ్‌లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి 1.35 సమయంలో గట్టిగా శబ్దం వినపడింది. లేచి చూడగా కారులో దట్టమైన పొగ ఆవరించింది. ఆ రోడ్డులో వస్తున్న కొందరు వాహనాలను నిలిపి కారులో ఉన్న వారిని రక్షించడానికి యత్నించారు. కారు ముందుభాగం తునాతునకలు కాగా, డోర్లు లాక్ అయ్యాయి. 20 నిమిషాలు ప్రయత్నించి డోర్లు తీశారు. ఓ యువకుడు దగ్గుతుండగా మిగిలినవారు దాదాపు చనిపోయి ఉన్నారు. ఓ యువతి తల ముందు అద్దంలో ఇరుక్కుంది. కారు సీట్లు రక్తసిక్తమైయ్యాయి, కారులోపల ఏడుమంది చిక్కుకుని కాళ్లు, చేతులు విరిగిపోవడంతో సీట్లు రక్తమయం కాబడ్డాయి. ప్రమాద స్థలంలో రక్తం ధారలు కట్టింది. సతీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆడుగోడి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. -
మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నై: డీఎంకేలోని వర్గపోరు ఓ మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. క్షమాపణలు చెప్పినా, కాళ్లపై పడి వేడుకున్నా కనికరించనందున ఈ తీవ్రనిర్ణయ. విషమపరిస్థితిలో మెరుగైన చికిత్స కోసం శుక్రవారం తిరునెల్వేలి నుంచి చెన్నైకి తరలింపు ఆలస్యంగా వెలుగుచూసిన వివరాలు. తెన్‌కాశీ జిల్లా ఆలంగుళం అసెంబ్లీ నియోజకవర్గానికి పూంగోదై ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈమె దివంగత మాజీ మంత్రి ఆవడి అరుణ కుమార్తె. 2006 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పూంగోదై సాంఘికసంక్షేమశాఖా మంత్రిగా పనిచేశారు. 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గెలుపొందారు. ఈనెల 18న అధికమోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడంతో స్పృహతప్పిపోయారు. ఆమెను ఐసీయూ లో చికిత్స మొదలుపెట్టారు. ఆత్మహత్యకు కారణాలివేనా ? ఆలంగుళం నియోజకవర్గ సమస్యలపై ఈనెల18న తిరుమలైపురంలో జరిగిన జరిగిన సమావేశానికి పూంగోదై అరగంట ఆలస్యంగా చేరుకున్నారు. గెలుపొందిన తరువాత నియోజకవర్గం వైపే రావడం లేదని ఈ సమయంలో పార్టీ నేత ఒకరు ఆమెపై తీవ్ర విమర్శలు చేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమెకు త్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేలపై బైఠాయించారు. దీంతో పార్టీ నేతల కాళ్లపై పడి ఆమె క్షమాపణ వేడుకున్నారు. తన పరిస్థితిని వివరించేందుకు పూంగోదై వేదికపైకి వెళ్లగానే మైక్ కట్‌చేశారు. స్టాలిన్‌కు ఫిర్యాదు చేస్తానని కారులో వెళ్లిపోయారు. తండ్రి మరణం తరువాత ఆస్తితగాదాలు చోటు చేసుకుని తమ్ముడు ఎళిల్వానన్తో విబేధాలు ఏర్పడ్డాయి. పోలింగ్‌బూత్ సమావేశాల్లో పార్టీ నేతలు ఎళిల్‌వానన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పూంగోదైను కాదని ఎళిల్‌వానన్‌కు సీటిచ్చే పరిస్థితి నెలకొనడంతో తీవ్ర కుంగుబాటుకు లోనైట్లు సమాచారం. (చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లు) చెన్నైకి తరలింపు.. ఆత్మహత్యాయత్నం చేసి తిరునెల్వేలోని షీబా ఆస్త్రత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పూంగోదైను మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఉదయం విమానంలో చెన్నైకి తరలించి ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. తాను ఆత్మహత్యకు పాల్పడలేదని శుక్ర వారం మీడియాతో పూంగోదై చెప్పడం గమనార్హం. -
పరిస్థితి ఉద్రిక్తం.. ఎమ్మెల్యే ఫైరింగ్
సాక్షి, చెన్నై : స్థల వివాదం కత్తి పోట్లకు దారి తీయడంతో తన చేతిలో ఉన్న తుపాకీతో డీఎంకే ఎమ్మెల్యే ఇదయవర్మన్ ఇష్టానుసారంగా ఫైరింగ్ చేయడం తిరుప్పోరూర్‌లో కలకలం రేపింది. ఇరువర్గాలు వీరంగం సృష్టిస్తూ వాహనాలను తగులబెట్టాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే ఇదయవర్మన్‌ను అరెస్టు చేశారు. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని చెంగోడు గ్రామంలో అన్నాడీఎంకే నేత తాండవ మూర్తి బంధువుగా పేర్కొంటున్న అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్ 350 ఎకరాల స్థలాన్ని చౌకగా కొనుగోలు చేసి ఉన్నారు. ఈ స్థలంలోకి వెళ్లేందుకు దారి లేదు. ఇక్కడ ప్లాట్లు వేసి రియల్ వ్యాపారం చేయడానికి సిద్ధమైన కుమార్ రోడ్డు కోసం తన బలాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. గ్రామస్తులు దీనన్ని అడ్డుకుంటూ వచ్చారు. గ్రామ ఆలయానికి సంబంధించిన స్థలం మీదుగా ప్రత్యేక రోడ్డును తన స్థలంలోకి వేయడానికి సిద్ధమయ్యాడు. దీన్ని కూడా అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తుడైన కుమార్ చెన్నై నుంచి శనివారం సాయంత్రం ఓ యాభై మంది కిరాయి ముఠాను ఆ గ్రామంలోకి వెంట బెట్టుకు వెళ్లాడు. కత్తులతో వీరంగం..ఫైరింగ్ వచ్చీరాగానే కిరాయి ముఠా సినీ తరహాలో చేతిలో కత్తులు, దుడ్డు కర్రలను చేతబట్టి దిగడంతో ఆగ్రామస్తులు భయంతో వెనక్కు తగ్గారు. ఇదే అదునుగా ప్రొక్లైయినర్లను రంగంలోకి దించిన కుమార్ అనుచరులు, ఆలయ స్థలం మీదుగా రోడ్డు మార్గానికి తగ్గ పనుల వేగాన్ని పెంచాడు. ఈ సమాచారం అందుకున్న డీఎంకే ఎమ్మెల్యే ఇదయవర్మన్ తండ్రి లక్ష్మీపతి అక్కడకు చేరుకుని కుమార్‌ను నిలదీశాడు. లక్ష్మీపతికి మద్దతుగా గ్రామస్తులు ఏకం కావడంతో వివాదం ముదిరింది. కిరాయి ముఠా దుడ్డు కర్రలతో గ్రామస్తుల మీద దాడులు చేస్తూ, కత్తులతో వీరంగం సృష్టించారు. (కాయ్ రాజా కాయ్.. కరోనా కేసులపై బెట్టింగ్‌ల జోరు) తన తండ్రి మీద దాడి సమాచారంతో ఆగమేఘాల మీద అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ఇదయ వర్మన్ పరిస్థితి చూసి తన వాహనంలో ఉన్న సింగిల్ బేరల్ గన్ను అందుకున్నాడు. కాల్పులు జరిపే పనిలో పడ్డాడు. అక్కడున్న జనం, కిరాయి ముఠా అందరూ భయంతో పరుగులు తీశారు. సినీ తరహాలో ఈ కాల్పులు సాగుతున్న సమయంలో, కుమార్ అనుచరులు ఎదురు దాడికి దిగడంతో తన నడుం భాగంలో దాచి పెట్టి ఉన్న మరో తుపాకీని తీసుకుని ఎమ్మెల్యే ఫైరింగ్ చేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యే చేతిలోని తుపాకీ నుంచి వచ్చిన తూటాలు కుమార్ కారు అద్దాలను చీల్చడం గమనార్హం. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడమే కాదు, అక్కడున్న నాలుగైదు వాహనాలను తగులబెట్టేశారు. చెంగోడులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్టు వచ్చిన సమాచారంతో చెంగల్పట్టు ఎస్పీ కన్నన్బృందం ఉరకలు తీసింది. అంతలోపు ఇరు వర్గాలు తిరుప్పోరూర్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఎమ్మెల్యే టార్గెట్ ఆ గ్రామంలో పరిస్థితిని సమీక్షించి, ఉద్రిక్తత మళ్లీ చోటు చేసుకోకుండా భద్రతా బలగాల్ని ఎస్పీ కన్నన్రంగంలోకి దించారు. అక్కడి నుంచి ఆయన తిరుప్పోరూర్ స్టేషన్‌కు వచ్చేలోపు ఇరు వర్గాలు జారుకున్నాయి. ఇరువర్గాలు ఫిర్యాదుల్ని పరిగణించిన ఎస్పీ, నలుగురు డీఎస్పీల నేతృత్వంలోని బృందాన్ని రంగంలోకి దించారు. ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే తూటా దెబ్బకు అటు వైపుగా వెళ్తున్న శ్రీనివాసన్ అనే వ్యక్తి గాయపడి ఉండడంతో కేసు మరింత బలంగా నమోదైంది. అదే సమయంలో శ్రీనివాసన్‌ను ఆసుపత్రి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడంతో ఇది ఎమ్మెల్యే పనిగా భావించారు. ముందుగా డీఎంకే ఎమ్మెల్యేను అరెస్టు చేయడం కోసం అధికార పక్షం నుంచి ఒత్తిడి వచ్చినట్టుంది. వేట ముమ్మరంగానే సాగింది. తనను పోలీసులు టార్గెట్ చేసిన సమాచారంతో తన తండ్రితో పాటుగా ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కాల్పులకు ఉపయోగించిన రెండు తుపాకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మరక్షణ కోసం ఎమ్మెల్యే తుపాకీ వాడుతున్నట్టు తేలింది. అయినా, ఆయన్ను పట్టుకోవడం లక్ష్యంగా రాత్రంతా వేట సాగగా, ఆదివారం ఉదయం చెన్నై శివారు మేడవాక్కంలో ఆయన ఉపయోగించిన కారును గుర్తించారు. స్వయంగా ఎస్పీ కన్నన్రంగంలోకి దిగడంతో చెన్నై చుట్టూ ఉన్న నిఘా నేత్రాల మీద దృష్టి పెట్టగా, ఎమ్మెల్యే తప్పించుకు వెళ్లిన మార్గాలు దొరికాయి. చెన్నై నుంచి చెంగల్పట్టు వైపుగా వెళ్తున్న ఎమ్మెల్యేను అరెస్టు చేసి తిరుప్పోరూర్ పోలీసు స్టేషన్‌కు తరించారు. తాను ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టుగా, తనకు లైసెన్స్ ఉందని ఇదయ వర్మన్ పేర్కొంటున్నారు. ఈ కేసులో సుమారు యాభై మందిని చేర్చారు. రియల్ యజమాని కుమార్, అతడి అనుచరుల కోసం కూడా వేట సాగుతోంది. డీఎంకే వర్గాల రూపంలో తుపాకీ సంస్కృతి మళ్లీ రాష్ట్రంలో తెర మీదకు వచ్చిందని మంత్రి జయకుమార్ మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఆయన తండ్రి ఇష్టానుసారంగా తుపాకీలతో జరిపిన కాల్పులకు సంబంధించి వీడియో ఆధారాలు ఉండబట్టే, పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. -
కోవిడ్‌తో డీఎంకే ఎమ్మెల్యే మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే, సినీ నిర్మాత జే అన్బళగన్ కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది రోజులు వైరస్‌తో పోరాడిన ఆయన చెన్నైలోని డాక్టర్ రేలా ఇనిస్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన తన పుట్టిన రోజునే ప్రాణాలు కోల్పోవడం విషాదం. 1958 జూన్ 10న జన్మించిన అన్బళగన్ 62వ ఏటిలోకి బుధవారం అడుగు పెట్టారు. అదే రోజు ఉదయం ఆయన మరణించారన్న వార్త కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక ప్రజాప్రతినిధి కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం దేశంలో ఇదే తొలిసారి. వరసగా మూడుసార్లు ఎమ్మెల్యే అయిన అన్బళగన్ సినిమా నిర్మాత, పంపిణీదారుడు, వాణిజ్యవేత్త కూడా. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్బళగన్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విషమంగా డీఎంకే ఎమ్మెల్యే ఆరోగ్యం
సాక్షి, చెన్నై : డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్ రేల ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్ ప్రకటించింది. చెన్నై చేపాక్కం –ట్రిప్లికేన్ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్. కరోనా నివారణ, సహాయక పనుల్లో ఈయన ఉరకలు తీసిన విషయం తెలిసిందే. ఈనెల రెండో తేదీన ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. పరీక్షించగా కరోనా నిర్ధారణ అయ్యింది. ఆయనకు క్రోంపేటలోని రేల ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఐసీయూకు తరలించారు. సమాచారం తెలుసుకున్న సీఎం పళనిస్వామి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడారు. ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆ మరుసటి రోజు ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో.. అన్భళగన్ ఆరోగ్యం కుదట పడ్డట్టేనని సర్వత్రా భావించారు. సోమవారం రాత్రి మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించింది. 90 శాతం మేరకు వెంటిలేటర్ ద్వారా ఆయనకు శ్వాస అందిస్తున్నారు. ఆయనకు ఇది వరకు బీపీ, కిడ్నీ సమస్యలుండడంతో ప్రస్తుతం 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచారు. ఆయన ఆరోగ్యం కుదుట పడేందుకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కాగా, ఆయన కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. -
24 గంటల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో 24 గంటల్లో డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు. గుడియాథం నియోజకవర్గానికి చెందిన ఎస్. కథవరాయణ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చనిపోయారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎంకే పార్టీ మరో ఎమ్మెల్యే తిరువత్తియూరు నియోజకవర్గ ఎమ్మెల్యే (డీఎంకే), మాజీ మంత్రి కేపీపీ స్వామి (58) గురువారం కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్న 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1962 జూలై 1వ తేదీన జన్మించిన స్వామి చెన్నై కేవీ కుప్పంలో నివసిస్తున్నారు. ఐదు నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తరువాత ఇంటివద్దనే వైద్యసేవలు అందుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఆరోగ్యం మరింత విషమించగా గురువారం ఉదయం 6.10 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. స్వామి మరణవార్త తెలుసుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఆయన భౌతికకాయాన్ని పార్టీశ్రేణులు, అభిమానుల సందర్శనార్థం ఇంటి వద్ద ఉంచారు. అంచెలంచెలుగా.. డీఎంకే సీనియర్ నేత, మాజీ కౌన్సిలర్ పరశురామన్ కుమారుడు స్వామి. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువత్తియూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది మత్స్యశాఖా మంత్రిగా పనిచేశారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్ చేతిలో ఓడిపోయారు. 2016 నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డీఎంకే మత్స్య విభాగం ఇన్చార్జ్గా నియమితులైనారు. డీఎంకే అగ్రనేత కరుణానిధితో ఎంతో సఖ్యతగా మెలిగేవారు. కేపీపీ స్వామి భార్య, మాజీ కౌన్సిలరైన ఉమ, పెద్ద కుమారుడు ఇనియవన్ కొంతకాలం క్రితం మరణించారు. కుమార్తె ఉదయకు వివాహం కాగా భర్తతో ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు పరశు ప్రభాకరన్ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. కేపీపీ స్వామికి ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. స్వామి కుటుంబ సభ్యుల్లో దాదాపుగా అందరూ డీఎంకేలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టినత్తార్ ఆలయం వీధి సమీపంలోని శ్మశానవాటికలో స్వామి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వామి మరణంతో అసెంబ్లీలో డీఎంకే బలం 99కి తగ్గింది. మత్స్యకార కుటుంబాలకు ఎనలేని సేవ : స్టాలిన్ మత్స్యకార సామాజికవర్గానికి స్వామి ఎనలేని సేవలు చేశారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కొనియాడారు. కేవీకుప్పంలోని స్వామి భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. స్వామి మరణం తనను ఎంతో కలచివేసిందని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించిన స్వామి అన్ని కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించేవారని, మత్స్యశాఖామంత్రిగా పనిచేసిన కాలంలో ఆ సామాజిక వర్గానికి ఆయన అందించిన సేవలను మరువలేమన్నారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనతో పట్టుబట్టి మరీ పనులు చేయించుకునేవారని గుర్తుచేసుకున్నారు. అనారోగ్యానికి గురైనపుడు స్వయంగా వెళ్లి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నానని, అయితే తన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా నియోజకవర్గ ప్రజల కష్టనష్టాలను వివరించారని అన్నారు. స్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు తిరునావుక్కరసర్ సంతాపం ప్రకటించారు. గవర్నర్ సంతాపం డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కేపీపీ స్వామి ఆకస్మిక మరణం ఎంతో ఆవేదనను కలుగజేసిందని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. తిరువొత్తియూరు నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటని అన్నారు. స్వామిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. -
డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు కుట్ర
సాక్షి, చెన్నై: డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు తి రునల్వేలి వేదికగా వ్యూహ రచన జరిగినట్టు, ఇంటెలిజెన్స్ దృష్టికి ఈ కుట్ర సమాచారం చేరినట్టు ఓ మీడియాలో వచ్చిన కథనం ఆ పార్టీ వర్గాల్ని కలవరంలో పడేసింది. దీంతో తమకు భద్రత కల్పించాలంటూ డీజీపీ రామానుజంను ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సభ్యులు 29 మంది అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఆ పార్టీలో ఏర్పడ్డ విభేదాల కారణంగా ఏడుగురు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పక్షాన చేరారు. పార్టీకి రెబల్‌గా వీరు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు తిరునల్వేలి వేదికగా కుట్ర జరిగి ఉన్నట్టు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. ఆ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు ఓ మీడియాలో కథనం సైతం వెలువడింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన బయలు దేరింది. అదే సమయంలో పార్టీ రెబల్ ఎమ్మెల్యే సురేష్‌కుమార్ వెళ్తున్న మోటార్‌సైకిల్‌ను తిరువణ్ణామలై కీల్ నాచ్చుపట్టు వద్ద ఓ వ్యాన్ ఢీకొట్టి వెళ్లి పోవడం అనుమానాలకు దారి తీసింది. దీంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన రెట్టింపు అయింది. దీంతో ఆపార్టీ నాయకుడు బాలాజీ నేతృత్వంలో పలువురు డీజీపీ కార్యాలయానికి శనివారం చేరుకున్నారు. అక్కడి ఫిర్యాదుల విభాగంలో వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యేల హత్యకు కుట్ర జరిగినట్టు సమాచారం అందిందన్నారు. ప్రధానంగా చెంగల్పట్టు ఎమ్మెల్యే అనగై మురుగేషన్, తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్ సుబ్రహ్మణ్యం, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే శేఖర్‌లను టార్గెట్ చేసి కుట్ర జరిగి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరునల్వేలి వేదికగా ఈ కుట్రకు పథకం రచించబడి ఉందని, ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని విన్నవించారు.