పార్టీ నేతలకు చేతులు జోడించి క్షమాపణలు
సాక్షి, చెన్నై: డీఎంకేలోని వర్గపోరు ఓ మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. క్షమాపణలు చెప్పినా, కాళ్లపై పడి వేడుకున్నా కనికరించనందున ఈ తీవ్రనిర్ణయ. విషమపరిస్థితిలో మెరుగైన చికిత్స కోసం శుక్రవారం తిరునెల్వేలి నుంచి చెన్నైకి తరలింపు ఆలస్యంగా వెలుగుచూసిన వివరాలు. తెన్‌కాశీ జిల్లా ఆలంగుళం అసెంబ్లీ నియోజకవర్గానికి పూంగోదై ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈమె దివంగత మాజీ మంత్రి ఆవడి అరుణ కుమార్తె. 2006 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పూంగోదై సాంఘికసంక్షేమశాఖా మంత్రిగా పనిచేశారు. 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గెలుపొందారు. ఈనెల 18న అధికమోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడంతో స్పృహతప్పిపోయారు. ఆమెను ఐసీయూ లో చికిత్స మొదలుపెట్టారు.
ఆత్మహత్యకు కారణాలివేనా ?
ఆలంగుళం నియోజకవర్గ సమస్యలపై ఈనెల18న తిరుమలైపురంలో జరిగిన జరిగిన సమావేశానికి పూంగోదై అరగంట ఆలస్యంగా చేరుకున్నారు. గెలుపొందిన తరువాత నియోజకవర్గం వైపే రావడం లేదని ఈ సమయంలో పార్టీ నేత ఒకరు ఆమెపై తీవ్ర విమర్శలు చేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమెకు త్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేలపై బైఠాయించారు. దీంతో పార్టీ నేతల కాళ్లపై పడి ఆమె క్షమాపణ వేడుకున్నారు. తన పరిస్థితిని వివరించేందుకు పూంగోదై వేదికపైకి వెళ్లగానే మైక్ కట్‌చేశారు. స్టాలిన్‌కు ఫిర్యాదు చేస్తానని కారులో వెళ్లిపోయారు. తండ్రి మరణం తరువాత ఆస్తితగాదాలు చోటు చేసుకుని తమ్ముడు ఎళిల్‌వానన్‌తో విబేధాలు ఏర్పడ్డాయి. పోలింగ్‌బూత్ సమావేశాల్లో పార్టీ నేతలు ఎళిల్‌వానన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పూంగోదైను కాదని ఎళిల్‌వానన్‌కు సీటిచ్చే పరిస్థితి నెలకొనడంతో తీవ్ర కుంగుబాటుకు లోనైట్లు సమాచారం. (చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లు)
చెన్నైకి తరలింపు..
ఆత్మహత్యాయత్నం చేసి తిరునెల్వేలోని షీబా ఆస్త్రత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పూంగోదైను మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఉదయం విమానంలో చెన్నైకి తరలించి ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. తాను ఆత్మహత్యకు పాల్పడలేదని శుక్ర వారం మీడియాతో పూంగోదై చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment