tiruttani
-
TTD : తిరుత్తణిలో ప్రత్యేక పూజలు...పట్టువస్త్రాలు సమర్పించారు..!
-
తిరుత్తణి సుబ్రమణ్యస్వామి : కావళ్లతో పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు
సాక్షి, చెన్నై: ఎమ్మెల్యేపై వస్తున్న ఫిర్యాదులను సీఎం దృష్టికి వెళ్లకుండా చూడడానికి రూ. 25 లక్షలు డిమాండ్ చేసిన నకిలీ పోలీసు అధికారి, అతడి భార్యను తిరువళ్లూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గత 25న తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి తాను హోంశాఖలో డీఎస్పీనని పరిచయం చేసుకున్నాడు. తిరుత్తణిలో అక్రమాలకు ఎమ్మెల్యే పాల్పడుతున్నట్టు వివరిస్తూ, ఇప్పటికే కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. సంబంధిత ఫిర్యాదులు సీఎందృష్టికి వెళితే ఎమ్మెల్యే పదవిపోవడం ఖాయం. అయితే తమకు రూ.25 లక్షలు ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి ఫిర్యాదులు వెళ్లకుండా చూస్తామని చెప్పారు. చదవండి: యోగి కోసం.. రంగంలోకి ఫుల్‌టైమ్ సంఘ్ కార్యకర్తలు వెల్లాతికుళం ఎమ్మెల్యేపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే తామే పరిష్కరించామని కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ తిరువళ్లూరు ఎస్పీ వరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నకిలీ పోలీసు అధికారి విజయకుమార్, యశోదను అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ గుర్తింపు కార్డు, రూ.10వేల నగదు, కారును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో వీరు అంబత్తూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరు గతంలో వెల్లాతికుళం ఎమ్మెల్యే మార్కండేయన్‌ను సైతం బెదిరించినట్టు నిర్ధారించారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. చదవండి: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు -
కీలక నేతకు అన్నాడీఎంకే ఉద్వాసన.. ఎందుకిలా చేశారు?
తిరుత్తణి/తమిళనాడు: అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ సీనియర్ నేత నరసింహన్‌ను తొలగించారు. అన్నాడీఎంకేను ఎంజీఆర్ స్థాపించిన సమయం నుంచి ఆ పార్టీలో నరసింహన్ కొనసాగుతున్నారు. 1980లో విద్యార్థి దశలోనే తొలిసారిగా పళ్లిపట్టు అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి పళ్లిపట్టు, తిరుత్తణి ప్రాంతాల్లో అన్నాడీఎంకేకు పెద్ద దిక్కుగా ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పళ్లిపట్టులో అన్నాడీఎంకేకు జీవం పోసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంజీఆర్, జయలలిత అడుగుజాడల్లో పయనించారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2016లో తిరుత్తణి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో నరసింహనన్‌ను పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి పార్టీ అధిష్టానం తొలగించింది. బలమైన ప్రజా ఆదరణ ఉన్న నాయకుడిని పార్టీ వదులుకోవడంతో తిరుత్తణి నియోజకవర్గంలో అన్నాడీఎంకే డీలా పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. -
20 పైసలకే టీ షర్ట్, క్యూ కట్టిన జనం
సాక్షి, తిరుత్తణి: న్యూ ఇయర్ బంపర్ ఆఫర్‌తో తమిళనాడులోని తిరుత్తణిలో ఓ షాప్ వద్ద జనాలు క్యూ కట్టారు. చెలామణిలో లేని 20 పైసల నాణెం తెస్తే టీ షర్ట్ ఇస్తామని ప్రకటనతో తిరుత్తణిలోని దుస్తుల దుకాణానికి యువత పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుత్తణిలోని ఓ రెడీమెడ్ షోరూమ్ వినూత్న ప్రకటన చేసింది. చలామణిలో లేని పాత 20 పైసల నాణెం తెస్తే రూ.300 విలువ చేసే టీషర్ట్ ఇస్తామని నిర్వహకులు ప్రకటించారు. అయితే తొలి వందమందికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో యువత పెద్ద ఎత్తున దుకాణం ముందు క్యూ కట్టారు. టీ షర్ట్ దక్కినవాళ్లు ఆనందం వ్యక్తం చేయగా, దక్కని వాళ్లు నిరుత్సాహంతో వెనుతిరిగారు. -
రికార్డ్ బ్రేక్: 215 అడుగుల సూర్య కటౌట్
అభిమానానికి హద్దు ఉండదేమో. తమ ఆరాధ్య నటుడు సినిమా రిలీజ్ అంటే ఇక ఫ్యాన్స్‌కు పండుగే. పూల దండలు, పాలాభిషేకాలతో తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ప్రముఖ తమిళ హీరో సూర్య అభిమానుల కూడా తమ అభిమానంతో ఏకంగా రికార్డునే బ్రేక్ చేశారు.. సూర్య నటించిన ‘ఎన్జీకే’ చిత్రం శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో తమిళనాడు తిరువళ్లూరు జిల్లా సూర్య ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 215 అడుగుల ఎత్తైన కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌ను తిరుత్తణిలో బుధవారం ఆవిష్కరించారు. ఈ భారీ కటౌట్‌ను చూసేందుకు పోటీ పడుతున్నారు. అంతేకాకుండా కటౌట్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కాగా ఇప్పటివరకూ హీరో అజిత్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన 180 అడుగుల కటౌట్ దేశంలోనే అతిపెద్దదిగా రికార్డు నమోదు అయింది. అయితే తాజాగా సూర్య అభిమానులు ఆ రికార్డును బ్రేక్ చేసి ఏకంగా 215 అడుగుల పొడవైన కటౌట్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు రూ.7 లక్షలు ఖర్చు పెట్టారు. సుమారు 40మంది కార్మికులు ఈ కటౌట్ నిర్మాణంలో పాల్గొన్నారు. 35 రోజుల పాటు శ్రమించి తిరుత్తణి- చెన్నై బైపాస్ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేశారు. -
నోటిఫికేషన్ తర్వాతే పొత్తు వివరాలు: కెప్టెన్ మదిలో మాట
లోక్‌సభ ఎన్నికల్ని కూటమిగా ఎదుర్కొనేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సన్నద్ధమవుతున్నారు. తన మదిలోని మాటను శుక్రవారం పరోక్షంగా బయటపెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే పొత్తు ఎవరితో అన్నది తెలియజేస్తానన్నారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలసి డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తర్వాత కాలంలో అధికార పక్షమైన అన్నాడీఎంకేతో కెప్టెన్ వైరం పెట్టుకున్నారు. జయ సర్కారుపై అసెంబ్లీలో, బయటా విమర్శలు గుప్పిస్తున్నారు. డీఎండీకేను నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా అధికార పక్షం పావులు కదుపుతోంది. విజయకాంత్ ఓటు బ్యాంక్ మీద కన్నేసిన డీఎంకే, కాంగ్రెస్‌లు ఆయన్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. విజయకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధానగ్రూపు నేత, కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకే వాసన్ గతవారం ప్రత్యేకంగా శుభాకాంక్ష లు తెలియజేయడం చర్చనీయూంశమైంది. డీఎంకే పట్ల కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. దీంతో ఆ పార్టీని ఇరకాటంలో పెట్టే రీతిలో డీఎండీకేను తమ వైపు తిప్పుకోబోతోందన్న ప్రచారం ఊపందుకుంది. మహానాడు తర్వాత పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు పొత్తు నిర్ణయం ఉంటుందని విజయకాంత్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే మూపనార్ వర్ధంతి కార్యక్రమంలో తన మనసులోని మాటను పరోక్షంగా బయటపెట్టారు. మూపనార్ వర్ధంతి కాంగ్రెస్ సీనియర్ నేత, వాసన్ తండ్రి మూపనార్ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగింది. చెన్నైలోని మూపనార్ స్మారక కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. కాంగ్రెస్ వర్గాలు, మూపనార్ కుటుంబ సన్నిహితులు తరలివచ్చి పుష్పాంజలి ఘటించారు. కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకే వాసన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ వచ్చిన వారందరినీ పలకరించారు. విజయకాంత్ రాగానే ఆయన్ను ఆప్యాయంగా వాసన్ పలకరించారు. వాసన్, జ్ఞానదేశికన్‌లతో కలసి స్మారక ప్రదేశంలో కెప్టెన్ నివాళులర్పించారు. కాసేపు మాట్లాడుకుని చివరునవ్వులు ఒలకబోశారు. అనంతరం విజయకాంత్ మీడియూతో మాట్లాడారు. లోక్‌సభకు ఎన్నికలు వస్తే ఒంటరిగా పోటీ చేస్తారా లేక జత కడతారా అని ప్రశ్నించగా వేచి చూడండంటూ సమాధానం దాటవేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరినట్లుందే అని పదేపదే ప్రశ్నించగా, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెలువరించగానే చూడండి ఏమి జరగనుందో అంటూ ముందుకు కదిలారు. పొత్తు ఉన్నట్టా? లేనట్టా? అని మళ్లీ ప్రశ్నించగా నోటిఫికేషన్ వెలువడ్డ మరుక్షణమే ఎవరితో పొత్తు అన్నది ప్రకటిస్తానన్నారు. తద్వారా కూటమిగా వెళ్లడం ఖాయమని పరోక్షంగా సంకేతాలిచ్చారు. మూపనార్ తన గురువు, మార్గదర్శి అని కొనియూడారు. -
హత్యకేసులో ముగ్గురి అరెస్ట్
తిరుత్తణి, న్యూస్‌లైన్: తిరుత్తణి పెద్దవీధికి చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ తిరువళ్లూరు పడమర జిల్లా సహాయ కార్యదర్శి పసుంపొన్‌రాజా హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. పసుం పొన్‌రాజా భార్య శరణ్య. పెళ్లికి ముందే ఈమె తిరుత్తణి నెహ్రూనగర్ ఆచారి వీధికి చెందిన శశికుమార్ (35)తో ప్రేమకలాపాలు సాగించింది. శశికుమార్ పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. ఈమెకు వేరొకరితో పెళ్లి అయిన తర్వాత కూడా శశికుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త పసుంపొన్‌రాజా శరణ్యను మందలించాడు. కక్ష కట్టిన శరణ్య, శశికుమార్‌తో కలసి భర్తను హతమార్చడానికి ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో శశికుమార్ స్థానిక ఇంద్రానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్లు నాగరాజు (27), సుకుమారన్ సహాయాన్ని తీసుకున్నాడు. పసుంపొన్‌రాజా వ్యాపార విషయంగా అగూర్ ప్రాంతానికి వెళ్లి బైక్‌లో వస్తుండగా పసుంపొన్ రాజాను హత్య చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి శశికుమార్, నాగరాజు, శరణ్యను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సుకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను తిరుత్తణి కోర్టులో హాజరు పరచి, పుళల్ జైలుకు తరలించారు.