![Hyderabad: Woman Files Complaint Against Man For Blackmailing - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/7/police_0.jpg.webp?itok=Ngb8JBM3)
సాక్షి,సనత్‌నగర్(హైదరాబాద్): ఫోన్‌లో ఓ మహిళను పరిచయం చేసుకొని∙బెదిరింపులకు పాల్పడి రూ.2 లక్షలు కాజేసిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్ వివరాల ప్రకారం.. సనత్‌నగర్ ఎస్సార్టీ కాలనీకి చెందిన ఓ మహిళకు మూడున్నర నెలల క్రితం ఓ వ్యక్తి ఫోన్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ మరింత దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన కూడా ఆమె ముందుకు తెచ్చాడు. ( చదవండి: వరుడొస్తాడనుకుంటే పోలీసులొచ్చారు! )
అయితే.. తనకు పెళ్లయిందని ఓ కుమార్తె కూడా ఉందని ఆ మహిళా చెప్పినా వినిపించుకోలేదు. తనను పెళ్లి చేసుకోకపోతే మన మధ్య ఉన్న పరిచయం గురించి చెడుగా ప్రచారం చేస్తానని, ఈ విషయం ఎవరికి చెప్పకూడదంటే తనకు డబ్బు పంపాలని వేధింపులకు గురి చేయగా సదరు మహిళ గూగుల్ పే ద్వారా రూ.2 లక్షల నగదు పంపింది. డబ్బు తీసుకున్న తర్వాత కూడా వేధింపులు ఆపకపోవడంతో గురువారం బాధితురాలు సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment