భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..! | Akshay Kumar Says Taimur Ali Khan The Future Of Bollywood | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న అక్షయ్‌ కుమార్‌ కామెంట్స్‌

Published Thu, Aug 8 2019 3:39 PM | Last Updated on Thu, Aug 8 2019 4:30 PM

Akshay Kumar Says Taimur Ali Khan The Future Of Bollywood - Sakshi

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలను మించి క్రేజ్‌ సంపాదించున్నాడు సైఫ్‌-కరీనాల కుమారుడు తైమూర్‌ అలీఖాన్‌. ఈ బుడతడి రూపంలో బొమ్మలు కూడా తయారు చేశారంటే.. తైమూర్‌కు ఉన్న పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఖిలాడీ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా తైమూర్‌ గురించి ఇలానే స్పందించారు. మిషన్‌ మంగళ్‌ ప్రమోషన్‌ కార్యక్రమానికి తాప్సీ, విద్యాబాలన్‌తో కలిసి హాజరయ్యాడు అక్షయ్‌ కుమార్‌. ఈ సందర్భంగా విలేకరి ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న యంగ్‌స్టర్స్‌లో.. భవిష్యత్తులో సూపర్‌ స్టార్‌గా ఎదిగే హీరో, హీరోయిన్లు ఎవరని అక్షయ్‌ని ప్రశ్నించారు. అందుకు అక్షయ్‌ కాసేపు ఆలోచించి ‘తైమూర్‌ అలీ ఖాన్‌’ అన్నాడు. దాంతో విద్యాబాలన్‌, తాప్సీ ఒక్క సారిగా నవ్వి.. అవును నిజమే అన్నారు.

తైమూర్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇలా మాట్లాడాను అన్నారు అక్షయ్‌. అయితే అక్షయ్‌ చెప్పిన సమాధానం కరక్టే అంటున్నారు నెటిజన్లు. మూడేళ్ల వయసులోనే తైమూర్‌కు బోలేడంత క్రేజ్‌.. ఇక సిన్మాల్లోకి వస్తే.. ఖచ్చితంగా సూపర్‌ స్టార్‌ అవుతాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయితే తైమూర్‌ భవిష్యత్తు గురించి కరీనాను అడగ్గా ఆమె భిన్నంగా స్పందించారు. వాళ్ల తాత మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీలానే తైమూర్‌ని క్రికెటర్‌ని చేయాలని భావిస్తున్నట్లు కరీనా ఓ డాన్స్‌ షోలో చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement