Mission Mangalam
-
మిషన్ మంగళ్ జోడి మరోసారి!
ముంబై: సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని బాలీవుడ్ టాక్. మిషన్ మంగళ్ చిత్ర దర్శకుడు జగన్ శక్తి తెరకెక్కిస్తున్న చిత్రంలో ‘కిలాడీ’ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు బీ- టౌన్ సమాచారం. వీరిద్దరి కలయికలో ఇది రెండో చిత్రం. కాగా ఈ చిత్రానికి పేరు ఇంకా ఖరారు కాలేదు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ భారీ హంగులతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ విషయం తెలియడంతో అక్కీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ గతంలో ద్విపాత్రిభినయంలో నటించిన ‘అప్లాటూన్’, ‘రౌడి రాథోడ్’, ‘జై కిషన్’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.(చదవండి: అల్లుడిగా గర్వించే క్షణం: అక్షయ్ కుమార్) -
ఆ క్రెడిట్ అక్షయ్‌కే ఇవ్వాలి: కంగనా
ముంబై : బాలీవుడ్ ‘క్వీన్’ , జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నందుకు ప్రతీ ఒక్కరు అక్షయ్‌ను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. అక్షయ్, విద్యా బాలన్, నిత్యా మీనన్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో మిషన్ మంగళ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా పోస్టర్లలో అక్షయ్ కుమార్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘కావేరీ పిలుస్తోంది’ పేరిట నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమానికి హాజరైన కంగనా ఈ విషయంపై స్పందించారు. కంగనా మాట్లాడుతూ...‘ సినిమా చూసే ప్రేక్షకులలో 80 శాతం మంది మగవాళ్లే ఉంటారు. వారిలో చాలా మంది సినిమాను ఒక వినోద మాధ్యమంగానే పరిగణిస్తారు. అటువంటి వారే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఆదరించడానికి ఇష్టపడరు. ఉదాహరణకు మిషన్ మంగళ్ అనేది మహిళా శాస్త్రవేత్తల విజయాల గురించి తెరకెక్కిన సినిమా. అయితే ఆ సినిమా విషయంలో అక్షయ్‌ను కొంతమంది విమర్శించారు. నిజానికి అక్షయ్ ఒప్పుకున్నాడు కాబట్టే స్క్రిప్ట్ ఓకే అయ్యింది. అందుకే క్రెడిట్ మొత్తం అక్షయ్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేతప్ప తనను విమర్శించడం తగదు. నా మణికర్ణిక చిత్రాన్ని చాలా మంది హీరోలు సపోర్టు చేశారు. స్టార్ హీరోలుగా పేరొందిన వారు ఇలాంటి సినిమాలకు ప్రచారం చేస్తే బాగుంటుంది’అని పేర్కొన్నారు. కాగా ఇటీవలే విడుదలైన కంగనా సినిమా ‘జడ్జి మెంటల్ హై క్యా’ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక కంగన ప్రస్తుతం... తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
తొలిరోజే ‘ఖిలాడి’ భారీ వసూళ్లు!
ముంబై: గత నాలుగేళ్లుగా బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ తన సినిమాలను పండగల రోజున విడుదల చేస్తూ వస్తున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాల విడుదల అనగానే ఈద్ గుర్తుకు వచ్చినట్లే, అక్షయ్ కూడా తన సినిమాలను పంద్రాగష్టుకు విడుదల చేస్తూ సక్సెస్ కొడుతున్నాడు. ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్ ప్రాజెక్టు కథాంశంతో తెరకెక్కిన అక్షయ్ తాజా సినిమా ‘మిషన్ మంగళ్’ గురువారం వెండితెర మీదకు వచ్చింది. అక్షయ్ సెంటిమెంట్‌ను నిజం చేస్తూ తొలిరోజే భారీ వసూళ్లు సాధించింది. రూ.29.16 కోట్లు కలెక్ట్ చేయడంతో అక్షయ్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. కాగా స్పూర్తిదాయక కథాంశంతో తెరకెక్కిన అక్షయ్ గత సినిమా ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ 2017 ఆగష్టు 15న విడుదలైన మొదటి రోజే రూ .13.1 కోట్లు సాధించింది. ఇక జగన్ శక్తి దర్శకత్వంలో మిషన్ మంగళ్ కూడా అక్షయ్‌కు హిట్‌నిచ్చింది. ఈ చిత్రంలో అక్షయ్‌తో పాటుగా ప్రముఖ నటి విద్యబాలన్, తాప్సీ పన్నూ, సోనాక్షి సిన్షా, నిత్యా మీనన్, కీర్తి కుల్హరిలు ప్రధాన పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. ఇక నిన్న విడుదలైన జాన్ అబ్రాహం సినిమా ‘బాట్ల హౌస్’... అక్షయ్ ‘మిషన్ మంగళ్’తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడలేక చతికిలపడింది. -
‘మిషన్ మంగళ్’పై కిషన్ రెడ్డి రివ్యూ!
ముంబై: ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రేక్షకులను అలరించేందుకు ‘మిషన్ మంగళ్’ సినిమా సిద్ధమవుతోంది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌కుమార్, విద్యాబాలన్, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరి, నిత్యమీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మిషన్ మంగళ్’ గురువారం (ఆగస్టు 15న) ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఒకింత దేశభక్తి నేపథ్యంలో ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్ ప్రాజెక్టు కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. జగన్ శక్తి దర్శకత్వంలో ఆర్ బాల్కీ రచన, పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి అప్పుడే పాజిటివ్ టాక్ మొదలైంది. ఆదివారం ఢిల్లీలో ఈ సినిమా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ చూసినవారిలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు సెలబ్రెటీలు ఉన్నారు. ఈ సినిమా తమకు చాలా బాగా నచ్చిందని, సినిమా అద్భుతంగా ఉందని ఈ స్పెషల్ స్క్రీనింగ్ వీక్షించిన ప్రముఖులతోపాటు పలువురు నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. సినిమాకు సర్వత్రా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ‘ఓ చక్కని రోజును ఆసక్తికరంగా ముగించాను. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హాతోపాటు ఇతర చిత్రయూనిట్‌తో కలిసి ‘మిషన్ మంగళ్’ ప్రివ్యూ చూడటం అమేజింగ్‌గా అనిపించింది. సినిమాను బాగా తెరకెక్కించారు. ఇస్రో ఘనతను, విజయాలను అద్భుతంగా చూపించారు’ అని కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. What an interesting way to end a good day! Had an amazing time watching the preview of the movie #MissionMangalyaan along with the movie leads @AkshayKumar, @Sonakshisinha, and other cast & crew members. It's a movie very well shot, to depict the glory of @isro and its success. pic.twitter.com/biSSpRhttD — G Kishan Reddy (@kishanreddybjp) August 13, 2019 -
‘కృష్ణా జీ, నేను అక్షయ్‌ని మాట్లాడుతున్నా’
తన ప్రొఫెషన్ పట్ల హీరో అక్షయ్ కుమార్ ఎంత నిబద్ధతగా ఉంటారో అందరికి తెలిసిందే. ప్రస్తుతం అక్షయ్ మిషన్ మంగళ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ వెరైటీ సంఘటన చోటు చేసుకుంది. ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ విలేకరి అక్షయ్ అండ్ టీం మాటలను రికార్డ్ చేయాలని తన ఫోన్‌ను వారి ముందు పెట్టాడు. అయితే దాన్ని సైలెంట్లో పెట్టడం మర్చిపోయాడు. ఇక సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి కుల్హరీ మాట్లాడుతుండగా విలేకరి ఫోన్ ఒక్కసారిగా మోగింది. వెంటనే అక్షయ్ కుమార్ ఫోన్ తీసుకుని ‘హలో.. కృష్ణా జీ, నేను అక్షయ్‌ను మాట్లాడుతున్నాను. మేం విలేకరులు సమావేశంలో ఉన్నాం. ఇది పూర్తయ్యాక నేను ఫోన్ చేస్తాను’ అని మాట్లాడి ఫోన్ కట్ చేశారు. అక్షయ్ చేసిన పనికి అక్కడున్న వారందరూ ఒక్కనిమిషం ఆశ్చర్యపోయినా తర్వాత తేరుకుని నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు అక్షయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఆయన సూపర్‌స్టార్ అయ్యారంటూ కామెంట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ మంగళ్’ ఈ నెల 15న విడుదలవుతుంది. ఈ చిత్రంలో విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ, నిత్యా మేనన్, తాప్సీ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. View this post on Instagram Lot of us use our phones to record interviews but this particular reporter forgot to silent her phone. Guess what happens #AkshayKumar picks up the call and answers back 😎😄😄😄 #viralbhayani @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Aug 13, 2019 at 4:56am PDT -
ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అంటే చాలు.. చాలా మంది నటులు పెద్దగా ఉత్సాహం చూపరు. కొందరు సినిమా అంగీకరించడానికి ముందే ప్రమోషన్ కార్యక్రమాల్లో తాము పాల్గొనమని ఒప్పందం చేసుకుంటారు. కానీ బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ మాత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. తోటి నటులతో కూడా చాలా సరదాగా ఉంటారు. ప్రస్తుతం అక్షయ్ అండ్ టీమ్ మిషన్ మంగళ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రమోషన్ కార్యక్రమంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. హీరోయిన్ సోనాక్షి సిన్హా, అక్షయ్‌ని కింద పడేసింది. ‘మిషన్ మంగళ్’ ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హీరోయిన్లు నిత్యా మీనన్, తాప్సీ, విద్యాబాలన్, కీర్తి కుల్హరి, సోనాక్షి సిన్హా, అక్షయ్ కుమార్ హాజరయ్యారు. వీరంతా కూర్చొని చిత్రానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు.ఈ క్రమంలో అక్షయ్ మాట్లాడుతూ.. కుర్చీతో పాటు వెనక్కి వాలాడు. అప్పుడు పక్కనే ఉన్న సోనాక్షి.. అక్షయ్ ఛాతిపై చేత్తో కొట్టింది. దాంతో అక్షయ్ కుర్చీతో సహా వెనక్కి పడిపోయాడు. అతను పడిపోతుండగా తాప్సీ పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం లేకపోయింది. అక్షయ్‌ని చూసి అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురవగా.. సోనాక్షి మాత్రం పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. అక్షయ్ సైతం దీన్ని సరదాగా తీసుకొని సోనాక్షి వైపు చేయి చూపుతూ ఏంటిది అన్నట్లుగా ఓ ఎక్స్ప్రెషన్ పెట్టడంతో మిగతావారూ నవ్వడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. జగన్ శక్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ మంగళ్’. భారతదేశం చేసిన మిషిన్ మార్స్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. -
మేము ఇద్దరం కలిస్తే అంతే!
ముంబై : బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహంలు నటించిన మిషన్ మంగళ్, బాట్లా హౌస్ సినిమాలు ఈ నెల 15న విడుదల కానున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని గాసిప్ప్ గుప్పుమన్నాయి. అలాంటిదేమి లేదని ఈ ఇద్దరు హీరోలు తాజాగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాన్ అబ్రహం మాట్లాడుతూ.. ‘మీరు ఎప్పుడైన గమనించారా... పెద్ద హీరోల సినిమాలన్ని సెలవుల్లో లేదా పండుగ రోజుల్లో విడుదల చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలోనే ప్రేక్షకులు కుటుంబంతో కలిసి సినిమాకి వస్తారు. అందుకే నా సినిమాను సెలవు రోజున విడుదల చేస్తున్నాం. అక్షయ్ నాకు మంచి మిత్రుడు. మా ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలవుతున్నంత మాత్రాన మా మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం చేయడం సరికాద’ని అన్నాడు. అలాగే అక్షయ్ కుమార్ కూడా ఇదే విషయంపై మిషన్ మంగళ్ ట్రైలర్ ఫంక్షన్లో మాట్లాడుతూ.. ‘ఒక సంవత్సరంలో దాదాపు 210 పైగా హిందీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. సంవత్సరానికి 52 వారాలు మాత్రమే ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే ఒకే రోజున రెండు సినిమాలు విడుదల కావడం పెద్ద విశేషం కాద’ని పేర్కొన్నాడు. తామిద్దం కలిసినప్పుడల్లా ఇలా అల్లరి చేస్తుంటామని జాన్ అబ్రహాం తనను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఫోటోను అక్షయ్ కుమార్ ట్విటర్లో షేర్ చేశాడు. ఈ ఫోటోకి ‘బ్రదర్ ఫ్రమ్ అనెదర్ మదర్’ అని క్యాప్షన్ పెట్టాడు. -
భవిష్యత్తు సూపర్ స్టార్ అతడే..!
బాలీవుడ్లో స్టార్ హీరోలను మించి క్రేజ్ సంపాదించున్నాడు సైఫ్-కరీనాల కుమారుడు తైమూర్ అలీఖాన్. ఈ బుడతడి రూపంలో బొమ్మలు కూడా తయారు చేశారంటే.. తైమూర్‌కు ఉన్న పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ కూడా తైమూర్ గురించి ఇలానే స్పందించారు. మిషన్ మంగళ్ ప్రమోషన్ కార్యక్రమానికి తాప్సీ, విద్యాబాలన్‌తో కలిసి హాజరయ్యాడు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా విలేకరి ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న యంగ్‌స్టర్స్‌లో.. భవిష్యత్తులో సూపర్ స్టార్‌గా ఎదిగే హీరో, హీరోయిన్లు ఎవరని అక్షయ్‌ని ప్రశ్నించారు. అందుకు అక్షయ్ కాసేపు ఆలోచించి ‘తైమూర్ అలీ ఖాన్’ అన్నాడు. దాంతో విద్యాబాలన్, తాప్సీ ఒక్క సారిగా నవ్వి.. అవును నిజమే అన్నారు. తైమూర్కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇలా మాట్లాడాను అన్నారు అక్షయ్. అయితే అక్షయ్ చెప్పిన సమాధానం కరక్టే అంటున్నారు నెటిజన్లు. మూడేళ్ల వయసులోనే తైమూర్‌కు బోలేడంత క్రేజ్.. ఇక సిన్మాల్లోకి వస్తే.. ఖచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే తైమూర్ భవిష్యత్తు గురించి కరీనాను అడగ్గా ఆమె భిన్నంగా స్పందించారు. వాళ్ల తాత మన్సూర్ అలీఖాన్ పటౌడీలానే తైమూర్‌ని క్రికెటర్ని చేయాలని భావిస్తున్నట్లు కరీనా ఓ డాన్స్ షోలో చెప్పుకొచ్చారు. -
వారం రోజులపాటు ఆశ్రమంలో
సినిమా: ఆశ్రమంలో గడిపొచ్చానని చెప్పింది నటి నిత్యామీనన్. ఏంటీ ఈ భామ ఆధ్యాత్మిక మార్గం పట్టిందా. అని అండిగేయకండి. తనకు నచ్చింది చేసే అరుదైన నటి నిత్యామీనన్. సినిమాలైనా తనకు నచ్చితే చిన్న పాత్రను చేయడానికైనా సిద్ధం అంటుంది. అలా అతిథి పాత్రల్లో నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ నటించిన మిషన్ మంగళ్ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులోనూ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది. ఇక కోలీవుడ్‌లో జయలలిత బయోపిక్‌గా తెరకెక్కనున్న ది ఐరన్ లేడీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. అదేవిధంగా సైకో అనే చిత్రంతో పాటు ఒక మలయాళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అలాంటి నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో వారం రోజులపాటు ఆశ్రమంలో గడిపినట్లు చెప్పింది. అలా ఎందుకు గడపాల్సి వచ్చిందన్నది చెప్పలేదు గానీ అక్కడ మతం గురించి నేర్చుకోలేదు గానీ, నా గురించి నేను తెలుసుకున్నానని చెప్పింది. పాఠాలు నేర్పడానికి చాలా కళాశాలలు ఉన్నాయి. మనుషులైన మన గురించి ఏ కళాశాలల్లోనూ చెప్పడం లేదు అని అంది. ఇకపోతే నటిగా తన గురించి చెప్పాలంటే తాను నటించే పాత్రల కోసం ముందుగా ఎలాంటి శిక్షణ తీసుకోనని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఎలాంటి పాత్రనైనా కష్టపడి నటించను. షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన తరువాత అక్కడ యూనిట్ వాళ్లు ఇచ్చిన దుస్తులు ధరించగానే నిత్యామీనన్ అన్న విషయాన్ని మరిచి ఆయా పాత్రలుగా మారిపోతానని చెప్పింది. సాధారణంగా తాను నటించాల్సిన సీన్ పేపర్లను, సంభాషణలను చివరి నిమిషంలోనే ఇస్తుంటారు. కొందరైతే ఉదయాన్నే ఇస్తారని చెప్పింది. అయితే చిత్ర కథను విన్నప్పుడే తన పాత్ర మదిలో నిలిచిపోతుందదని చెప్పింది. దాంతో పాత్రలో ఒదిగిపోతానని అంది. ఒక్కో సమయంలో సన్నివేశాలను దర్శకులు మారుస్తుంటారంది. అప్పుడు తాను ముందు చెప్పిన సన్నివేశాలు లేవే అని తాను అడిగితే వారు ఆశ్చర్యపోతుంటారని చెప్పింది. ప్రస్తుతం ది ఐరన్ లేడీ చిత్రంలో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నిత్యామీనన్ పేర్కొంది. -
‘ఆ మాట వింటేనే చిరాకొస్తుంది’
మహిళలకు సంబంధించిన ఏ అంశాల గురించి మాట్లాడాలన్నా, చర్చించాలన్నా ముందుంటారు హీరో అక్షయ్ కుమార్. ఈ క్రమంలోనే పాడ్‌మ్యాన్, టాయ్‌లెట్ వంటి సినిమాలు చేశారు అక్షయ్. ప్రస్తుతం ఈ ఖిలాడీ హీరో ‘మిషన్ మంగళ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల గురించి హిందీలో రూపొందుతున్న సినిమా ‘మిషన్ మంగళ్’. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పన్ను, కీర్తి కుల్హారీ, నిత్యా మీనన్ ఈ మహిళా శాస్త్రవేత్తల పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమంలో అక్షయ్ మాట్లాడుతూ.. ‘మిషన్ మంగళ్ చిత్రాన్ని ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా అంటే నాకు చాలా కోపం వస్తుంది. మనందరం సమానం అయినప్పుడు మేల్ ఓరియెంటెడ్, ఉమెన్ ఓరియెంటెడ్ అనే పేర్లు ఎందుకు. ఇది ఓ సినిమా అంతే. దాన్ని అలానే చూడాలి’ అన్నారు అక్షయ్. ‘ఇంటిని నడిపేది మహిళ. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఓ మహిళ చేతిలోనే ఉంది. రోజులు గడుస్తున్న కొద్ది మహిళలకు అన్నిరంగాల్లో సమ ప్రాధాన్యం లభిస్తుంది. మరి అలాంటప్పుడు సినిమాల్లో మాత్రం.. మేల్ ఓరియెంటెడ్, ఫిమేల్ ఓరియెంటెడ్ అనే తేడాలు ఎందుకు’ అన్నారు అక్షయ్. పిల్లల్ని శాస్త్రవేత్తలుగా ప్రోత్సాహించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అన్నారు అక్షయ్. సైంటిస్ట్ అనేది కూడా ఓ ప్రొఫెషనే. చంద్రయాన్ ప్రయోగం తర్వాత జనాలు.. ఈ రంగం వైపు అధిక ఆసక్తి చూపుతున్నారు అన్నాడు అక్షయ్ -
సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ యాక్షన్‌తో పాటుగా సామాజిక సందేశాలు ఇచ్చే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అక్షయ్ నటించిన తాజా చిత్రం ‘మిషన్ మంగళ్’ షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో మరో కొత్త సినిమాకు కూడా ‘ఖిలాడి’ ఓకే చెప్పాడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మాణంలో ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తున్న ‘బచ్చన్ పాండే’ సినిమాతో అభిమానులను అలరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి శుక్రవారం తన ఫస్ట్‌లుక్ విడుదల చేసిన అక్కి... మాస్ మసాలాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు హింట్ ఇచ్చాడు. నల్ల లుంగీ ధరించి మెడలో పెద్ద బంగారు గొలుసులు వేసుకుని, నుదుట తిలకంతో అక్షయ్ కొత్తగా కనిపిస్తున్నాడు. కాగా ఇది పూర్తిగా వినోదంతో కూడిన మాస్ సినిమా అని, గతంలో అక్షయ్ డబుల్ రోల్లో నటించిన ‘రౌడి రాథోడ్’ తరహలోనే ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతానికి మిషన్ మంగళ్ రీలీజ్ కోసం ఎదురుచుస్తున్న అక్షయ్.. ఆ సినిమా విడుదల తర్వాత ‘బచ్చన్ పాండే’ షూటింగ్ మొదలెడతాడని, వచ్చే ఏడాది అంటే 2020 క్రిస్మస్కి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు సమాచారం. Coming on Christmas 2020! In & As #BachchanPandey 😎 In #SajidNadiadwala’s Next, directed by @farhad_samji @NGEMovies @WardaNadiadwala pic.twitter.com/ayMkzwPEsJ — Akshay Kumar (@akshaykumar) July 26, 2019 -
అందుకే హాలీవుడ్లో నటించలేదు: అక్షయ్
మొదట కేవలం యాక్షన్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్.. రానురానూ అన్ని రకాల పాత్రలతో అభిమానులను మెప్పించాడు. అటు దేశభక్తి ఇటు సామాజిక సందేశం ఉన్న చిత్రాలతోపాటు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే బాలీవుడ్లో తనదైన శైలిలో పేక్షకులను మెప్పించిన అక్షయ్ కుమార్ ఇప్పటి వరకు హాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వలేదు. గత మూడు దశాబ్ధాలుగా బాలీవుడ్లో నటిస్తున్న అక్షయ్ ఒక్క హాలీవుడ్ సినిమా కూడా చేయకపోవడంతో అభిమానులకు అంతు చిక్కని సందేహంగా మిగిలిపోయింది. అయితే ఇప్పటికి సమాధానం చెప్పుకొచ్చాడు ఈ ఖిలాడీ స్టార్. ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నాకు హాలీవుడ్ నుంచి ఆఫర్ రాలేదని చెప్పను కానీ, అవన్నీ నా దృష్టిలో గొప్పవి కావు. ఒకవేళ మంచి సినిమాలలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నా ప్రతిభను చూపించడానికి సిద్ధంగా ఉన్నాన’ని అన్నారు. ఇంతకాలంగా బాలీవుడ్లో నటిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాని తెలిపారు. తన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడటం ఆనందించదగ్గ విషయమన్నారు. ఇప్పటికే తొమ్మిది వరుస విజయాలు సాధించిన అక్షయ్‌కుమార్ ‘మిషన్ మంగళ్’ సినిమాతో ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జగన్ శక్తి దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాలో విద్యాబాలన్, తాప్సీ, సోనాక్షి సిన్హా, నిత్యామీనన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. -
ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!
‘పరిణీత’ సినిమాతో 2005లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విద్యా బాలన్.. తన 14 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. 2011లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తాజాగా విద్యాబాలన్ నటించిన ‘మిషన్ మంగళ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో విద్యతోపాటు తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, శర్మాన్ జోషి, నిత్యా మీనన్, కృతి కుల్హారీ తదితరులు నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా ఓ విలేకరి విద్యా బాలన్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఈ సినిమాకుగాను జాతీయ అవార్డు వస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి విద్యా స్పందిస్తూ.. అవార్డుల గురించి నేను ఆలోచించనని బదులివ్వగా.. వెంటనే అక్షయ్ కలగజేసుకుంటూ.. తను అబద్ధం చెప్తోందన్నారు. ‘ఈమె పుట్టగానే.. జాతీయ అవార్డు వచ్చిందంటూ కుటుంబసభ్యులకు నర్సు శుభాకాంక్షలు చెప్పింది’ అంటూ అక్షయ్ ఛలోక్తి విసిరారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. -
సైంటిస్ట్ వర్ష
ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల గురించి హిందీలో రూపొందుతున్న సినిమా ‘మిషన్ మంగళ్’. అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షీ సిన్హా, కీర్తి కుల్హారీ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఇందులో సైంటిస్ట్ వర్షా పిళ్లై పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తారు.‘‘మిషన్ మంగళ్’ సినిమా షూట్లో చివరి రోజు పాల్గొంటున్నాను’’అని ఆదివారం పేర్కొన్నారు నిత్యా మీనన్. జగన్ శక్తి దర్శకుడు. నిత్యా మీనన్‌కు హిందీలో తొలి చిత్రమిది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
ఆ వయసులోనే బాగా ఆస్వాదిస్తారు : విద్యాబాలన్
బాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ విద్యాబాలన్ ‘డర్టీపిక్చర్’తో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. రీసెంట్గా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బసవ తారకం పాత్రలో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇటీవలె విద్యా బాలన్ నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వయసు గురించి, ఆ వయస్సులో ఆడవారి ఆలోచనలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందరూ అనుకునేట్టుగా.. నలభైల్లోకి వచ్చాక స్త్రీలకు శృంగారంపై ఆసక్తి ఉండదని, దాన్ని ఆస్వాదించలేరని అంటారు కానీ అది నిజం కాదని విద్యాబాలన్ అన్నారు. నిజానికి ఆ వయసులోనే వాటిపై మోజు ఎక్కువ అవుతుందనీ, నలభైల్లో స్త్రీలు ఒత్తిడికి గురికారని, వయసు మీద పడుతున్న కొద్దీ మహిళలు మరింత చలాకీగా, సంతోషంగా కనిపిస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇరవైల్లో తన కలలకోసం బతికాననీ, ముప్పైల్లో తన గురించి తాను తెలుసుకున్నాననీ, నలభైల్లో తన జీవితాన్ని ఇష్టపడుతున్నాననీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం విద్యా బాలన్ మిషన్ మంగళ చిత్రంలో నటిస్తున్నారు. -
ఆ ఫీలింగ్ కలగలేదు!
ఇప్పటివరకు సౌత్‌లో సత్తా చాటి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కథానాయిక నిత్యామీనన్. ఈ ఏడాది ఆమె నార్త్ వైపు(బాలీవుడ్) కూడా దృష్టిసారించారు. ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్ ఆధారంగా తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘మిషన్ మంగళ్’ సినిమాలో నిత్యామీనన్ శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హిందీలో ఆమె ‘బ్రీత్ 2’ అనే వెబ్ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్‌కు జోడీగా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇన్ని రోజులు సౌత్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన మీరు ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు అన్న ప్రశ్నను నిత్యామీనన్‌ను అడిగినప్పుడు–‘‘హిందీ పరిశ్రమలో నేను ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను కానీ ఇక్కడి వారికి నేను తెలుసు. నా సినిమాలు కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. న్యూ కమర్‌ని అని, అవుట్‌సైడర్‌ని అన్న ఫీలింగ్ కలగలేదు నాకు. తక్కువ కాలంలోనే స్నేహితులుగా కలిసిపోయాం. ఇప్పుడు నేను హిందీలో చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్‌కు కెమెరామెన్స్ తమిళులే. వారితో నేను తమిళంలోనే మాట్లాడుతున్నాను. అక్కడ కంఫర్ట్‌గానే ఉంది. ‘మిషన్ మంగళ్’ సినిమాలో నా షూటింగ్ పూర్తికావొచ్చింది. బ్రీత్ వెబ్‌సిరీస్ ‘బ్రీత్ 2’లో నటిస్తున్నా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘ఐరన్‌లేడీ’ సినిమాలో లీడ్ రోల్ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు. -
భలే చాన్సులే!
‘మిషన్ మంగళ్’ అంటూ స్పేస్‌లోకి వెళ్తున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అంతేనా? తనతో పాటుగా ఐదుగురు హీరోయిన్స్‌ని తోడుగా తీసుకెళ్తున్నారు. జగన్ శక్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, కృతీ కుల్హారీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. భారతదేశం చేసిన మిషిన్ మార్స్ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ ఐదుగురు హీరోయిన్స్‌తో పాటు మరో భామ కూడా ఈ చిత్రానికి తోడయ్యారు. ‘నర్తనశాల’ ఫేమ్ కష్మీరా పరదేశి కూడా ఈ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేశారు. -
కష్టాలకు ‘మంగళం’
ఇప్పుడందరూ గుజరాత్ గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ గత ఐదేళ్లుగా ‘మంగళం మిషన్’ పేరుతో జరుగుతున్న అభివృద్ధి పనులు మహిళలకు అండగా నిలిచాయి. మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం రావడంతో సగం కష్టాలు తీరిపోతాయన్నది అక్షరాలా నిజం. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి పాలనాయంత్రాంగం ‘మంగళం మిషన్’ని ఏర్పాటు చేసింది. దీనికింద రెండు లక్షలకు పైగా ‘సఖి మండల్స్’ పనిచేస్తున్నాయి. దాదాపు పాతిక లక్షలమంది మహిళలు ఈ మండలాలలో సభ్యులుగా ఉన్నారు. స్వయం ఉపాధి బృందాలుగా ఏర్పడి ఈ మహిళలంతా రకరకాల వ్యాపారాలు చేస్తూ...చూస్తుండగానే తిరుగులేని వ్యాపారస్థులుగా స్థిరపడిపోయారు. పసుపు తయారీ నుంచి పాడిపరిశ్రమ వరకూ కొన్ని వందల ఉపాధి మార్గాలతో ఉద్యోగినులకు దీటుగా నిలబడ్డారు. ‘కెర్గామ్’ అనే గ్రామంలో లిల్లీతోటను సాగుచేస్తూ అక్కడి సఖి మండల్ మహిళలు ఆర్జిస్తున్న లాభాలను చూసి మామూలు రైతులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. వడోదరా జిల్లాలోని మరో మారుమూల గ్రామానికెళితే 300 మంది మహిళలు సభ్యులుగా ఉన్న సఖి బృందం ‘డెయిరీ’ వ్యాపారం చేస్తున్నారు. నెలకు 7 లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న వీరి పనితీరు చూడడానికి పాలవ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు.