మిషన్‌ మంగళ్‌ జోడి మరోసారి! | Akshay Kumar To Play Dual Role In Up Coming Film | Sakshi
Sakshi News home page

ద్విపాత్రాభినయంలో మరోసారి అక్షయ్‌

Published Tue, Dec 8 2020 7:54 PM | Last Updated on Tue, Dec 8 2020 8:07 PM

Akshay Kumar To Play Dual Role In Up Coming Film - Sakshi

ముంబై: సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని బాలీవుడ్‌ టాక్‌. మిషన్‌ మంగళ్‌ చిత్ర దర్శకుడు జగన్‌ శక్తి తెరకెక్కిస్తున్న చిత్రంలో ‘కిలాడీ’ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు బీ- టౌన్‌ సమాచారం. వీరిద్దరి కలయికలో ఇది రెండో చిత్రం. కాగా ఈ చిత్రానికి పేరు ఇంకా ఖరారు కాలేదు. పూర్తి స్థాయి సైన్స్‌ ఫిక్షన్‌ భారీ హంగులతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.  ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ విషయం తెలియడంతో అక్కీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్‌ గతంలో ద్విపాత్రిభినయంలో నటించిన ‘అప్లాటూన్‌’, ‘రౌడి రాథోడ్‌’, ‘జై కిషన్‌’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.(చదవండి: అల్లుడిగా గర్వించే క్షణం: అక్షయ్‌ కుమార్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement