బాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ విద్యాబాలన్ ‘డర్టీపిక్చర్’తో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. రీసెంట్‌గా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బసవ తారకం పాత్రలో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇటీవలె విద్యా బాలన్ నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వయసు గురించి, ఆ వయస్సులో ఆడవారి ఆలోచనలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అందరూ అనుకునేట్టుగా.. నలభైల్లోకి వచ్చాక స్త్రీలకు శృంగారంపై ఆసక్తి ఉండదని, దాన్ని ఆస్వాదించలేరని అంటారు కానీ అది నిజం కాదని విద్యాబాలన్ అన్నారు. నిజానికి ఆ వయసులోనే వాటిపై మోజు ఎక్కువ అవుతుందనీ, నలభైల్లో స్త్రీలు ఒత్తిడికి గురికారని, వయసు మీద పడుతున్న కొద్దీ మహిళలు మరింత చలాకీగా, సంతోషంగా కనిపిస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇరవైల్లో తన కలలకోసం బతికాననీ, ముప్పైల్లో తన గురించి తాను తెలుసుకున్నాననీ, నలభైల్లో తన జీవితాన్ని ఇష్టపడుతున్నాననీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం విద్యా బాలన్ మిషన్ మంగళ చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment