
ఈ ఫోటో సైఫ్, కరీనాల కొడుకుదేనా..?
పుట్టగానే ఫేమస్ అయిపోయినా బాలీవుడ్ స్టార్ బేబి, తైమూర్ అలీఖాన్ పటౌడి. తన పేరు ప్రకటించిన రోజునే సినీ అభిమానులకు సుపరిచితుడైపోయాడి క్యూట్ బాయ్. బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ముద్దుల కొడుకే తైమూర్ అలీ ఖాన్ పటౌడి. పుట్టగానే న్యూస్ హెడ్ లైన్గా మారిన తైమూర్ పేరు తాజాగా మరోసారి వార్తల్లో వినిపిస్తోంది. గతంలో తన కొడుకును ప్రపంచానికి పరిచయం చేస్తూ సైఫ్ ఓ ఫోటో రిలీజ్ చేశాడు.
సైఫ్ ఎత్తుకొని ఉన్న ఆ ఫోటోలో తైమూర్ ముఖం ఒక్క పక్కగా మాత్రమే కనిపించింది. ఈ తరువాత ఇంత వరకు ఈ పటౌడిల వారసుడి ఫోటో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. తాజాగా షోషల్ మీడియాతో తైమూర్ తొలి సోలో క్లోజప్ అంటూ ఓ ఫోటో హడావిడి చేస్తోంది. అందంగా కనిపిస్తోన్న చిన్నారి ఫోటో సైఫ్, కరీనా ముద్దుల కొడుకుదే అంటున్నారు ఫ్యాన్స్. అయితే సైఫ్ కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఈ ఫోటో తైమూర్ దేనా కాదా..? అన్న క్లారిటీ మాత్రం రాలేదు.