Sherlyn Chopra Viral Comments On Film Directors - Sakshi
Sakshi News home page

Sherlyn Chopra: డైరెక్టర్‌ అసభ్య ప్రశ్న.. కౌంటర్‌ ఇచ్చిన టాప్‌ హీరోయిన్‌

Published Sun, Jul 23 2023 1:23 PM | Last Updated on Mon, Jul 24 2023 11:02 AM

Sherlyn Chopra Viral Comments On Film Directors - Sakshi

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్‌ హీరోయిన్లలో షెర్లిన్‌ చోప్రా ఒకరు. అక్కడ ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం చాలా ఎక్కువ. 2012లో 'ప్లేబోయ్' అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది షెర్లిన్ చోప్రా.  హాట్‌ హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో పాటు వివాదస్పద విషయాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈమె పక్కా హైదరాబాదీనే తన చదవు, బాల్యం అంతా ఇక్కడే.. సినిమాలపై ఆసక్తితో తను ముంబయిలో అడుగు పెట్టింది. గతంలో కొంతమంది సినీ దర్శకులు తనను బాడీషేమింగ్ చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలా బయటపెట్టింది. 

(ఇదీ చదవండి: 'బేబీ' ఫేమ్‌ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌.. హీరో ఎవరంటే)

'నా వక్షోజాల గురించి చాలా మంది దర్శకులు ఓపెన్‌గానే సర్జరీ చేయించుకున్నావా అని అడిగేవారు. ఇలాంటి వారి లిస్ట్‌ చాలానే ఉంది.  నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి అవును.., చేయించుకున్నాననే చెప్పాను. ఎందుకంటే నాపై భాగం ఫ్లాట్‌గా ఉంటడం నాకు నచ్చలేదన్నాను. దీంతో వెంటనే వాళ్లు ఓసారి టచ్ చేయొచ్చా..? సైజ్ ఎంత..? అని అడిగారు. ఆ సమయంలో నాకు చాలా ఆశ్చర్యమేసింది. హీరోయిన్ల కప్ సైజు తెలుసుకున్న తర్వాతే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారా? అంటూ.. ఆ డైరెక్టర్‌ను ఇలా అడిగాను.  నీకు పెళ్లయింది. కాబట్టి  స్త్రీ శరీర నిర్మాణ శాస్త్రం గురించి తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్లండని చెప్పాను. దానికి అతను తన భార్యతో మాత్రం ఓపెన్‌గా మాట్లడలేడంట. కానీ నాతో మాత్రం ఇలా మాట్లాడుతానంటున్నాడు.' అని పేర్కొంది.  

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ షో ఫేక్‌.. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు)

ఇలా సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకుల నుంచి కాస్టింగ్‌ కౌచ్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అలాంటి వారిలో కొందరైతే ఏకంగా డిప్రెషన్ ఎపిసోడ్‌ల నుంచి బయటపడేందుకు డ్రగ్స్‌లో మునిగిపోవాలని చాలాసార్లు సూచించారని, కానీ అలాంటి వాటికి దూరంగానే ఉండేదానినని చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement