Sherlyn Chopra Wants To Marry Rahul Gandhi But She Has One Condition - Sakshi
Sakshi News home page

Sherlyn Chopra: రాహుల్‌ గాంధీని పెళ్లి చేసుకుంటా.. కానీ: షెర్లిన్ చోప్రా

Published Mon, Aug 7 2023 3:44 PM | Last Updated on Mon, Aug 7 2023 3:56 PM

Sherlyn Chopra Wants To Marry Rahul Gandhi But She Has One Condition - Sakshi

బిగ్ బాస్ కంటెస్టెంట్‌, బాలీవుడ్ భామ షెర్లిన్ చోప్రా తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ బీటౌన్‌లో విమర్శలకు గురవుతూ ఉంటోంది. తాజాగా షెర్లిన్ చేసిన కామెంట్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన షెర్లిన్ చోప్రా కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని బోల్డ్ కామెంట్స్ చేసింది భామ. షెర్లిన్ తరచుగా వివాదస్పద కామెంట్స్ చేస్తూ  అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. 

(ఇది చదవండి: ఉద్యోగులకు బంపరాఫర్..సెలవుతో పాటు ఏకంగా టికెట్స్ కూడా!)

అయితే రాహుల్‌ పెళ్లి చేసుకోవడానికి ఓ కండీషన్‌ కూడా పెట్టింది. పెళ్లి తర్వాత తన ఇంటిపేరు మార్చుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. అలా అయితే రాహుల్‌ను పెళ్లాడతానని వెల్లడించింది ముద్దుగుమ్మ. అయితే షెర్లిన్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఇంతవరకు స్పందించలేదు.  కాగా.. షెర్లిన్ ఏక్తా కపూర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ 'పౌరాష్‌పూర్- 2' ప్రమోషన్లతో బిజీగా ఉంది. చాలా ఏళ్ల విరామం తర్వాత ఆమె నటిస్తోంది. ఈ షో జూలై 28న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. 

గతంలో ఫ్రెండ్స్ ఫరెవర్, రెడ్ స్వస్తిక్, వజా తుమ్ హో, గేమ్, చమేలీ, జవానీ దివానీ: ఎ యూత్‌ఫుల్ జాయ్‌రైడ్ లాంటి చిత్రాలలో కనిపించింది. ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో షెర్లిన్ పాల్గొంది.

(ఇది చదవండి:  ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రముఖ నటి మృతి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement