'ఎందుకు ఒళ్లు అమ్ముకున్నానంటే..' | Sherlyn Chopra explains her sleeping with people for money tweet | Sakshi
Sakshi News home page

'ఎందుకు ఒళ్లు అమ్ముకున్నానంటే..'

Published Sun, May 29 2016 4:23 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

'ఎందుకు ఒళ్లు అమ్ముకున్నానంటే..' - Sakshi

'ఎందుకు ఒళ్లు అమ్ముకున్నానంటే..'

ముంబయి: బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా తాను చేసిన సంచలన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. డబ్బుకోసమే తనను తాను అర్పించుకున్నానని చెప్పిన ఆమె అందుకు పూర్వపరాలు వివరించింది. 'చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. కేవలం చనిపోయిన మా నాన్న కూడా డాక్టర్ అవడమే అందుకు కారణం కాదుగానీ సైన్స్ అంటే నాకు ఇష్టం. కేవలం అకాడమిక్ విషయాల్లోనే కాకుండా ఇతర అంశాల్లో కూడా ముందుండేదాన్ని. మిస్ ఆంధ్రా గెలుచుకునే వరకు కూడా అంతాబానే ఉంది. పందొమ్మిదేళ్లకు గ్లామర్ పిచ్చిలో పడి ఓ చౌరస్తాలో నిల్చున్నాను.

అప్పుడే ఓ విభిన్న మార్గాన్ని ఎంచుకున్నాను. నేను మోడలింగ్ చేసే రోజుల్లో నాకంటే వయసులో పెద్దవారితో డేటింగ్ చేసేదాన్ని. వాళ్లు అడగకున్నా ఎంతో విలువైన గిఫ్టులు అందిస్తూ ఆకర్షించేవాళ్లు. ఈ క్రమంలో పడి ఎవరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారో, భద్రంగా చూసుకుంటారో, గౌరవిస్తారో అనే విషయం తెలుసుకోవడం కష్టంగా మారింది. కానీ తర్వాత తర్వాతే తెలిసింది నా దగ్గరికి వచ్చేవారు నాకు విలువ ఇచ్చి వచ్చే వారు కాదని. మంచిగా మారపోవడం వెనుక ఉన్న నా ఉద్దేశం మంచిదే కానీ.. మీడియానే తప్పుగా మార్చింది' అని ఆమె చెప్పింది. డబ్బుకోసమే తాను తన ఒళ్లు అమ్ముకున్నానని ఇటీవల షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement