షెర్లిన్ చోప్రాపై దర్శకుడి పరువునష్టం దావా | Film director files defamation case against actress Sherlyn Chopra | Sakshi
Sakshi News home page

షెర్లిన్ చోప్రాపై దర్శకుడి పరువునష్టం దావా

Published Wed, Feb 5 2014 3:28 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

షెర్లిన్ చోప్రాపై దర్శకుడి పరువునష్టం దావా - Sakshi

షెర్లిన్ చోప్రాపై దర్శకుడి పరువునష్టం దావా

కామసూత్ర 3డి చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాపై ఆ చిత్ర దర్శకుడు రూపేష్ పాల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఆమె తనను తిట్టిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎర్నాకులం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన తన ఫిర్యాదు దాఖలు చేశారు. షెర్లిన్ చోప్రా తన ట్విట్టర్ అకౌంట్లో తనను తిట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణకు కోర్టు మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.

జనవరి 15వ తేదీన ఆమె తన ట్విట్టర్లో తనను నేరుగా అసభ్యంగా తిట్టిందని, అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసిందని పాల్ చెప్పారు. పాల్ తనకు ఈ చిత్రంలో నటించినందుకు మొత్తం ఇవ్వాల్సిన పారితోషికంలో రూ. 7 లక్షలు ఇవ్వలేదని ఇంతకుముందు షెర్లిన్ చోప్రా ముంబైలోని ఓ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు దాఖలుచేసింది. అతడి లైంగిక వాంఛలు తీర్చకపోవడంతో కామసూత్ర 3డి చిత్రానికి సంబంధించిన మిగిలిన మొత్తం ఇచ్చేది లేదని కూడా పాల్ తనను బెదిరించినట్లు షెర్లిన్ ఆరోపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement