
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయమై చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు బాద్‌షాకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా డ్రగ్స్ గురించి మాట్లాడిన పాత వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ వీడియోలో షారుక్ ఖాన్ ఇచ్చిన పార్టీలో తను చూసిన విషయాల గురించి షెర్లిన్ వివరించింది. ఈ స్టార్‌కి ఐపీఎల్ కోల్‌కతా నైట్ రైడర్స్ అనే టీమ్ ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన షారుక్ ఓ పార్టీ ఇచ్చాడు. దాని గురించి మాట్లాడుతూ..‘పార్టీలో డ్యాన్స్ చేసి అలసిపోయిన వాష్‌రూమ్‌కు వెళ్లాను. డోర్ ఓపెన్ చేయగానే అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యాను. ఒక్క క్షణం తర్వాత ఓ విషయం అర్థమైంది.
అక్కడుంది బాలీవుడ్ స్టార్ల భార్యలు. అందరూ అక్కడి అద్దాల ముందు నిల్చుని తెల్లని పౌడర్ పీలుస్తున్నారు. వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని అర్థమై షాకయ్యాను. వారిని చూసి నవ్వి బయటకు వచ్చేశాను. తర్వాత షారుక్‌కి, అతడి స్నేహితులకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయా. బాలీవుడ్‌లో జరిగే పార్టీలు గురించి ఆ రోజే పూర్తిగా తెలిసింది’ అని ఈ బ్యూటీ తెలిపింది.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ విషయం బాలీవుడ్‌ని కుదిపేస్తున్న ఈ తరుణంలో ఈ భామ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కేసు విషయంలో ఆర్యన్ ఎన్‌సీబీ కస్టడీని కోర్టు అక్టోబర్ 7వరకు పొడిగించింది.
చదవండి: ఆర్యన్ ఖాన్ పాత వీడియో వైరల్
शाहरुख़ की KKR वाली पार्टी के बारे में, मैं ने ये इंटरव्यू पिछले साल दिया था..https://t.co/WMNTfeyy7A pic.twitter.com/5JTV3dNncz
— Sherlyn Chopra 🇮🇳 (@SherlynChopra) October 4, 2021
Comments
Please login to add a commentAdd a comment