Sherlyn Chopra Bares Claws At Deepika Padukone Over Ranveer Singh PhotoShoot - Sakshi
Sakshi News home page

Sherlyn Chopra: ఆమె భర్తలా కాదు.. నా ఒంటిపై దుస్తులైనా ఉన్నాయి

Published Wed, Jul 27 2022 2:33 PM | Last Updated on Wed, Jul 27 2022 3:24 PM

Sherlyn Chopra Bares Claws at Deepika Padukone over Ranveer Singh PhotoShoot - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసిన ఫోటోషూట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ మ్యాగజైన్ కోసం ఆయన నగ్నంగా ఫోటోలు దిగి.. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి కాస్త వైరల్‌ అయ్యాయి. రణ్‌వీర్‌ చేసిన ఫోటోషూట్‌ని కొంతమంది  కొంతమంది సమర్థిస్తుంటే..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

ఇదే విషయంపై తాజాగా నటి, మోడల్‌ షెర్లిన్‌ చోప్రా స్పందిస్తూ..రణ్‌వీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు అతని భార్య, స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెను టార్గెట్‌ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో దీపిక తన దుస్తుల గురించి అవమానకరంగా మాట్లాడిందని, ఇప్పుడు ఆమె భర్త ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటో దిగినే స్పందించడం లేదని మండిపడింది.

(చదవండి: అందుకే రణ్‌వీర్‌ నూలు పోగు లేకుండా ఫోటో షూట్‌ చేశాడేమో: ఆర్జీవీ)

‘గతంలో ఓ అవార్డు ఫంక్షన్‌కి వెళితే.. నా దుస్తుల పట్ల దీపిక అవమానకరంగా మాట్లాడింది. నన్ను చూసి అసహ్యించుకుంది. కనీసం అప్పుడు నా ఒంటిపై దుస్తులైనా ఉన్నాయి. ఆమె భర్తలా నేను నగ్నంగా ఫోటోలు దిగలేదు.  ఓ మ్యాగజైన్‌ కోసం కాస్త బోల్డ్‌గా ఫోటో దిగితేనే..అందరూ నా క్యారెక్టర్‌ని తప్పుపట్టారు. మరి ఇప్పుడు రణ్‌వీర్‌ నగ్నంగా ఫోటోషూట్‌ చేస్తే.. ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. సమాజం కూడా ఎందుకు ఇలా ద్వంద్వ ధోరణిలో వ్యవహరిస్తుందో తెలియడం లేదు’అని షెర్లిన్‌ అసహనం వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement