Sajid Khan Had Flashed His Private Parts At Me Says Sherylin Chopra - Sakshi
Sakshi News home page

Sherylin Chopra: లైంగిక ఆరోపణలు.. అలాంటి వ్యక్తిని ప్రైమ్‌టైమ్‌లో చూపిస్తారా?

Published Tue, Oct 11 2022 3:13 PM | Last Updated on Tue, Oct 11 2022 5:21 PM

Sajid Khan Had Flashed His Private Parts At Me Says Sherylin Chopra - Sakshi

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాపులారిటీతో పాటు కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్న బిగ్‌బాస్‌ హిందీలో 15 సీజన్లు పూర్తి చేసుకొని తాజాగా 16వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఇందులో డైరెక్టర్‌ సాజిద్‌ ఖాన్‌ను కంటెస్టెంట్‌గా తీసుకోవడంపై తీవ్ర విమర్శలు రేకేత్తుతున్నాయి. మీటూలో భాగంగా పలువురు మహిళలు ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అలాంటి వ్యక్తిని బిగ్గెస్ట్‌ రియాలిటీ షోకు తీసుకురావడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా నటి షెర్లీన్‌ చోప్రా ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. ఓసారి సాజిద్‌ తన ప్రైవేట్‌ పార్టుని చూపించి దానికి 10వరకు ఎంత రేటింగ్‌ ఇస్తావని నాతో చీప్‌గా ప్రవర్తించాడు. ఇప్పుడు నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లి అతడికి రేటింగ్‌ ఇవ్వాలనుకుంటున్నా. అలాగే సల్మాన్‌ ఖాన్‌ ఈ విషయంలో జోక్యం చేసుకొని సాజిద్‌ని తప్పించాల్సిందేనంటూ కోరింది.

మరోవైపు మందనా కరిమి, సోనా మహపాత్ర, ఉర్ఫీ జావేద్, నేహా భాసిన్ సహా పలువురు ఆర్టిస్టులు సాజిద్‌ ఖాన్‌ను వెంటనే హౌస్‌ నుంచి బయటకు వెళ్లగొట్టాలని సోషల్‌ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement