#మీటూ: సలోని సంచలన ఆరోపణలు | Saloni Chopra Accuses Sajid Khan of Sexual Harassment  | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 12 2018 12:26 PM | Last Updated on Fri, Oct 12 2018 1:52 PM

Saloni Chopra Accuses Sajid Khan of Sexual Harassment  - Sakshi

సలోని చోప్రా, సాజిద్‌ఖాన్‌

ముంబై: భారత్‌లో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కో బాధితురాలు తమకు జరిగిన చేదు అనుభవాలను తెలుపుతూ పెద్ద మనుషులగా చెలామణి అవుతున్న ఒక్కోక్కరి వ్యక్తిత్వాలను బయట పెడ్తున్నారు. ఇలా నానా పటేకర్‌, వికాస్‌, అలోక్‌ నాథ్‌, సుభాష్‌ ఘాయ్‌, రజత్‌ కపూర్‌ల చీకటి వ్యవహరాలు వెలుగులోకి రాగా.. తాజాగా డైరెక్టర్‌ సాజిద్‌ ఖాన్‌పై బాలీవుడ్‌ నటి సలోని చోప్రా సంచలన ఆరోపణలు చేసింది.

2011లో సాజిద్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సలోని.. అది తన జీవితంలోనే ఓ భయంకరమైన అనుభవంగా అభివర్ణించింది. ఇంటర్వ్యూలోనే ‘స్వయం సంతృప్తి పొందుతావా? వారానికి ఎన్నిసార్లు?’ అనే అసభ్యకర ప్రశ్నలతో సాజిద్‌ తనపట్ల అమానుషంగా ప్రవర్తించాడని తెలిపింది. ఇక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరిన తరువాత చుక్కలు చూపించాడని పేర్కొంది. తను డైరెక్టెర్‌ అసిస్టెంట్‌ను మాత్రమేనని, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను కాదని చెబుతుండేవాడని, బికీని ఫొటోలు అడిగేవాడని ఆరోపించింది.

నటులు డ్రెస్‌ మార్చుకునే గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని, వారి డ్రెస్‌ తీసి చూపించమని అడిగేవాడని, వాటిని తను అడ్డుకోబేతే బయటకు పంపేవాడని పేర్కొంది. తనను లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. సినిమాలో అవకాశం కావాలంటే తనతో గడపాలన్నాడని, చాలా మంది మహిళలను ఇలానే వాడుకున్నాడని తెలిపింది. సమయం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు బయటపెడుతున్నట్లు స్పష్టం చేసింది.

ఇక సాజిద్‌ఖాన్‌ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ జర్నలిస్టు సైతం ఆరోపించింది.  ఇంటర్వ్యూలో అనవసరంగా అతని పురుషాంగం గురించి ప్రస్తావిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడని ఆరోపించింది. ఇక మరో నటి రచెల్‌ వైట్‌ సైతం సాజీద్‌ ఖాన్‌ తనను లైంగికంగా వేదించాడని ఆరోపిస్తూ ట్వీట్‌ చేసింది. అతన్ని తొలిసారి కలిసిప్పుడు తనని బట్టలు తీసేయమన్నాడని పేర్కొంది.

షూటింగ్‌ రద్దు చేయండి: అక్షయ్‌ కుమార్‌
తను హీరోగా సాజీద్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హౌస్‌ ఫుల్‌ షూటింగ్‌ను నిలిపేయాలని అక్షయ్‌ కుమార్‌ చిత్ర నిర్మాతలక విజ్ఞప్తి చేశాడు. సాజీద్‌ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ పూర్తైన తరువాత షూటింగ్‌ మొదలు పెడుదామని ట్వీట్‌ చేశాడు.

చదవండి: #మీటూ ఉద్యమ వార్తలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement