ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 152 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్నర్లు చెలరేగిపోయారు. నౌమన్ అలీ 11, సాజిద్ ఖాన్ 9 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించారు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధికి చెందిన 20 వికెట్లు ఈ ఇద్దరు స్పిన్నర్లే తీయడం విశేషం.
52 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. సాజిద్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయగా.. నౌమన్ అలీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మూడు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. పాక్ సొంతగడ్డపై 11 మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్ డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తర్వాత తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పాక్ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 291 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ సెంచరీతో (114) సత్తా చాటగా.. మిగతా ఆటగాళ్లెవ్వరూ కనీసం చెప్పుకోదగ్గ స్కోర్లు కూడా చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ ఏడు, నౌమన్ అలీ మూడు వికెట్లు పడగొట్టారు.
75 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. అఘా సల్మాన్ అర్ద సెంచరీతో (63) రాణించాడు. ఇంగ్లీష్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4, జాక్ లీచ్ 3, బ్రైడన్ కార్స్ 2, మాథ్యూ పాట్స్ ఓ వికెట్ పడగొట్టారు.
297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను నౌమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) 144 పరుగులకే కుప్పకూల్చారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ టాప్ స్కోరర్‌గా (37) నిలిచాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్ గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment