Bhojpuri Star Rani Chatterjee Accuses Filmmaker Sajid Khan of Casting Couch - Sakshi
Sakshi News home page

Rani Chatterjee: ఐటం సాంగ్‌.. అసభ్యంగా ప్రవర్తించిన డైరెక్టర్‌

Published Mon, Oct 17 2022 5:45 PM | Last Updated on Mon, Oct 17 2022 6:46 PM

Bhojpuri Star Rani Chatterjee Accuses Filmmaker Sajid Khan of Casting Couch - Sakshi

బిగ్‌బాస్‌ షో వల్ల కంటెస్టెంట్లు మరింత పాపులర్‌ అవుతుంటారు. కానీ ఓ వ్యక్తి వల్ల కొద్ది రోజులుగా హిందీ బిగ్‌బాస్‌ షో పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. బిగ్‌బాస్‌ 16 వ సీజన్‌లో అడుగుపెట్టిన సాజిద్‌ ఖాన్‌పై పలువురు సెలబ్రిటీలు విరుచుకుపడుతున్నారు. షెర్లిన్‌ చోప్రా, కనిష్క సోని సహా పలువురు.. అతడు చేసిన అరాచకాలను బయటపెడుతూ వెంటనే సాజిద్‌ను బయటకు పంపించేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ భోజ్‌పురి నటి రాణి చటర్జీ తన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

"హిమ్మత్‌వాలా సినిమా షూటింగ్‌లో సాజిద్‌ను మొదటి సారి కలిశాను. తర్వాత ఓసారి ఆయన తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఈ మీటింగ్‌ మనిద్దరి మధ్యే అని, నా మేనేజర్‌ను వెంటపెట్టుకుని రావొద్దని ఫోన్‌లో చెప్పాడు. బాలీవుడ్‌లో అతడు పెద్ద డైరెక్టర్‌, అందుకని నేను ఆయన చెప్పినట్లు చేశాను. జుహులో ఆయన ఇంటికి ఒంటరిగా వెళ్లాను. ఢోకా ఢోకా ఐటమ్‌ సాంగ్‌ కోసం నన్ను సెలక్ట్‌ చేసిశాడన్నాడు. ఆ పాటలో నేను పొట్టి దుస్తులు వేసుకోవాల్సి ఉంటుందని చెప్తూ నా కాళ్లు చూపించమన్నాడు. ఆయన ఉద్దేశం అర్థం కాక అతడు చెప్పింది చేశా. ఆ వెంటనే ఆయన నా చుట్టు కొలతలు అడుగుతూ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడా? మీరిద్దరూ కలిసి ఎంజాయ్‌ చేస్తారా? అని అభ్యంతరకరమైన ప్రశ్నలు వేశాడు. నన్ను అసభ్యంగా తాకాలని ప్రయత్నించాడు. ఈ విషయం బయటకు చెప్తే ఎక్కడ నన్ను ఇండస్ట్రీలో బ్యాన్‌ చేస్తారోనన్న భయంతో ఇంతవరకు నోరు మెదపలేదు " అని చెప్పుకొచ్చింది రాణి చటర్జీ.

చదవండి: ప్రపంచంలో అందమైన భామలు.. అందులో దీపికా
యాంకర్‌కే కౌంటర్లు ఇచ్చిన సుదీప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement