Bigg Boss: Kanishka Soni Shocking Revelations Against Sajid Khan - Sakshi
Sakshi News home page

Kanishka Soni: సినిమా ఛాన్స్‌.. ఇంటికి పిలిచాడు: దర్శకుడి బాగోతం బయటపెట్టిన నటి!

Published Thu, Oct 13 2022 4:59 PM | Last Updated on Thu, Oct 13 2022 11:48 PM

Bigg Boss: Kanishka Soni Shocking Revelations Against Sajid Khan - Sakshi

సంచలనాలకు మారుపేరు బిగ్‌బాస్‌ రియాలిటీ షో. పలు ప్రాంతీయ భాషల్లో విజయవంతంగా కొనసాగుతున్న ఈ షో ఇటీవలే హిందీలో 16వ సీజన్‌ను లాంఛ్‌ చేసింది. అయితే ఇందులో ఓ కంటెస్టెంట్‌ పేరు సోషల్‌ మీడియాలో రెండు రోజులుగా తెగ మార్మోగిపోతోంది. అతడిని బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వెంటనే పంపించేయాలంటూ సెలబ్రిటీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ కంటెస్టెంట్‌ మరెవరో కాదు దర్శకుడు, నటుడు సాజిద్‌ ఖాన్‌. మీటూ ఉద్యమ సమయంలో ఇతడిపై పలువురు మహిళల నుంచి లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాంటి వ్యక్తిని బిగ్‌బాస్‌ షోలోకి ఎలా తీసుకున్నారంటూ నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.

తాజాగా పవిత్ర రిష్తా సీరియల్‌ నటి కనిష్క సోని సైతం సాజిద్‌ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు తనతో నీచంగా ప్రవర్తించాడని చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. '2008లో ఓ దర్శకుడు నాకు సినిమా ఛాన్స్‌ ఇచ్చినందుకు తన ఇంటికి పిలిచి అక్కడ నా టాప్‌ పైకి ఎత్తి నడుము చూపించమన్నాడు. ఈ విషయాన్ని గత నెలలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాను కానీ అతడి పేరు మాత్రం వెల్లడించలేదు. అయితే ఇప్పుడా వ్యక్తి బిగ్‌బాస్‌ షోలో ఉండటం, అతడు బయటకు రావాలని సినిమా వాళ్లు కూడా డిమాండ్‌ చేస్తుండటంతో నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను.

అతడి నిజస్వరూపం బయటపెడుతున్నందుకు నాకిప్పటికీ కొంత భయంగానే ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్లు నన్ను చంపడానికి కూడా వెనకాడరు. మన భారత ప్రభుత్వం మీద నాకెలాగూ నమ్మకం లేదు కానీ ఆ భగవంతుడు నావైపే ఉంటాడని ఆశిస్తున్నాను. నాకెంతో ఇష్టమైన సల్మాన్‌ ఖాన్‌ను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా.. క్యారెక్టర్‌ చూడకుండా ఓ వ్యక్తిని బిగ్‌బాస్‌లోకి ఎలా తీసుకుంటారు? ఇది పక్కన పెడితే తన బండారం బయటపెట్టిన నేను ఇకపై భారత్‌కు తిరిగి రావాలనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్లు నన్ను బతకనివ్వరు, అలా అని నేను అంత వీకేం కాదు. ఇప్పుడిప్పుడే హాలీవుడ్‌లో అడుగుపెడుతూ నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా' అని  చెప్పుకొచ్చింది కనిష్క.

చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ
రోహిత్‌ త్యాగం.. అతడిని ఎవ్వరూ కాపాడలేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement