ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్, హీరో రితేశ్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న "యారోంకి బారాత్" అనే చాట్ షోలో బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషి.. తన చిన్నతనంలో జరిగిన ఆసక్తికర సంఘటనను వెల్లడించింది. తన సోదరుడు, బాలీవుడ్ నటుడు సకీబ్ సలీంకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణమని, ఓ సందర్భంలో అతనితో గొడవ పడ్డప్పుడు కోపంలో అతని ఆరాధ్య దైవమైన సచిన్ పోస్టర్లను చించేశానని పేర్కొంది. దీనికి బదులుగా అతను తన ఫేవరెట్ క్రికెటర్ అయిన షాహిద్ అఫ్రిది ఫోటోలను చించేశాడని వివరించింది.
అయితే షో హోస్ట్‌లు.. నువ్వు సచిన్ పోస్టర్లను చించావా అని ప్రశ్నించడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. తను కూడా సచిన్ వీరాభిమానినేనని.. చిన్నతనంలో అన్న చెల్లెల్ల మధ్య ఇటువంటి సంఘటనలు తరుచూ జరుగుతుంటాయని కవర్ చేసుకుంది. తను క్రికెట్‌ను ఫాలో అవుతున్న రోజుల్లో పాక్ ఆటగాడు అఫ్రిది అరంగేట్రం చేశాడని, అతని దూకుడైన ఆటతీరు, అతని హెయిర్ స్టైల్ తనను బాగా ఇంప్రెస్ చేశాయని చెప్పుకొచ్చింది. 90వ దశకంలో ఆఖర్లో అఫ్రిదికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదని, కాబట్టి తాను కూడా అతనికి అకర్షితురాలినయ్యానని తెలిపింది. కాగా, హ్యూమా ఖురేషి 2012లో విడుదలైన "గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్" సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
చదవండి: ఆర్‌సీబీ అభిమానినే కానీ, కోహ్లి నా ఫేవరెట్ క్రికెటర్ కాదు: రష్మిక
Comments
Please login to add a commentAdd a comment