'రజనీకాంత్.. ఆసియా సూపర్ స్టార్' | Rajinikanth can be called Asian superstar: Sajid Khan | Sakshi
Sakshi News home page

'రజనీకాంత్.. ఆసియా సూపర్ స్టార్'

Published Fri, Dec 4 2015 8:12 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

'రజనీకాంత్.. ఆసియా సూపర్ స్టార్'

'రజనీకాంత్.. ఆసియా సూపర్ స్టార్'

ముంబై: ప్రాంతీయ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిన ఘనత తమిళ సూపర్స్టార్ రజనీకాంత్దేనని దర్శకుడు సాజిద్ ఖాన్ ప్రశంసించారు. జాకీచాన్ మాదిరిగా అమితాదరణ ఉందని, రజనీకాంత్ ఆసియా సూపర్స్టార్ అని అన్నారు.

రజనీకాంత్ గురించి రాసిన 'ద వారియర్ వితిన్' పుస్తకాన్ని సాజిద్ ఖాన్ ఆవిష్కరించారు. రజనీని అమితంగా ఆరాధించే అభిమానుల్లో తానొకడని, రజనీకాంత్ జీవిత విశేషాలతో కూడిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.  రజనీకాంత్ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్తో పోల్చారు. 'అమితాబ్, రజనీలు ఇద్దరూ లెజెండ్స్, సూపర్ స్టార్స్. అసంఖ్యాక అభిమానుల్ని సంపాదించారు. అభిమానుల నుంచి అమితాదరణ పొందారు. సినిమా స్థాయిని పెంచారు. రజనీకి నేను వీరాభిమాని అయినా మరో ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ అంటే చాలా గౌరవం. రజనీ జీవితం గురించి పుస్తకం రాసినా, సినిమా తీసినా ఆసక్తికరంగా ఉంటుంది' అని సాజిద్ ఖాన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement