‘ఆ చేదు అనుభవాల నుంచి నేను నుంచి పూర్తిగా బయటపడ్డాను. అతడికే జీవితం కాస్త మారి ఉంటుంది. మనచుట్టూ ఎంతోమంది నేరగాళ్లు, మోసగాళ్లు ఉంటారు. లైంగిక వేధింపులపై గళం విప్పినప్పుడు ఎంతో మంది నా క్యారెక్టర్‌ను ఇష్టం వచ్చినట్లుగా జడ్జ్ చేశారు. అవమానాలకు గురిచేశారు. అప్పుడు కాస్త బాధ పడ్డాను. కానీ ఇప్పుడు అలా కుంగిపోయే ప్రసక్తే లేదు. నాకు ఎదురైన వేధింపుల గురించి బయటపెట్టడం ద్వారా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. అయితే అందరూ నాలాగా ఉండాలని ఆశించకూడదు కదా’ అని బాలీవుడ్ నటి ప్రియాంక బోస్ తన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ తనను లైంగికంగా వేధించారంటూ ప్రియాంక బోస్ మీటూ స్టోరిని బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.
కాగా ప్రియాంక బోస్ ప్రస్తుతం.. ప్రకాశ్ ఝా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరీక్షతో పాటు మేఘా రామస్వామి ద ఆడ్స్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష గురించి మాట్లాడుతూ.. ‘ ఓ రిక్షావాలా కుటుంబం కథ ఇది. కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకునే తల్లిదండ్రులు పడే వేదనే పరీక్ష. ఇటువంటి సినిమాలో నటించడం ద్వారా నటిగా ఓ మెట్టు ఎక్కినట్టు భావిస్తున్నా అని ప్రియాంక చెప్పుకొచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయని ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు. ఇక సాజిద్ ఖాన్‌పై నటి సలోని చోప్రాతో పాటు ప్రియాంక బోస్, మందనా కరిమి, రేచల్ వైట్ వంటి పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ అతడిపై ఏడాది పాటు నిషేధం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment