ఫరా ఖాన్ బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ చిత్రనిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా ఫరా ఖాన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. ఆమె అందించిన చాలా పాటలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆమె 80 సినిమాల్లో దాదాపు 100 పాటలకు సంగీతమందించారు. మొదట మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఫరా ఖాన్ ఆ తరువాతే దర్శకురాలిగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె జీవితంలో ఎదురైన అత్యంత దుర్భర పరిస్థితులను వివరించారు. దాదాపు ఆరేళ్ల పాటు స్టోర్ రూమ్‌లో నివసించినట్లు వెల్లడించింది. ఇటీవలే 'ఇండియన్ ఐడల్ 13' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
ఫరా ఖాన్ మాట్లాడూతూ..' మా తండ్రి చనిపోయినప్పుడు కేవలం 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నాకు 18 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. తన సోదరుడు సాజిద్ ఖాన్‌కు అప్పుడు 14 ఏళ్లు. దీంతో తమ బంధువుల ఇంటిలోని స్టోర్ రూమ్‌లో ఆరేళ్ల పాటు నివసించాం. చివరకు తమకు ఇంటి స్థలం కూడా లేదని వాపోయారు.
బిగ్ బాస్-16వ పాల్గొన్న ఆమె సోదరుడు సాజిద్ ఖాన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. మద్యం మత్తులో తన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు చెల్లించడానికి కూడా కుటుంబం వద్ద డబ్బు లేదని అన్నారు. ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ అంత్యక్రియలు, రేషన్, కరెంటు బిల్లుల కోసం డబ్బు ఇచ్చాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment