ఫరా ఖాన్ తల్లి మేనకా ఇరానీ కన్నుమూత | Farah Khan Mother Menaka Irani Passed Away | Sakshi
Sakshi News home page

ఫరా ఖాన్ తల్లి మేనకా ఇరానీ కన్నుమూత

Jul 26 2024 4:07 PM | Updated on Jul 26 2024 6:07 PM

Farah Khan Mother Menaka Irani Passed Away

బాలీవుడ్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఫరాఖాన్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. నేడు (జులై 26) ఆమె అమ్మగారు మేనక ఇరానీ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని అధికారికంగా ఫరాఖాన్‌ తెలపనప్పటికీ పలు నివేదికలు ఆమె మరణాన్ని ధృవీకరిస్తున్నాయి. కొంత కాలంగా మేనక ఇరానీ తీవ్రమైన అనారోగ్యం కారణంగా పలు శస్త్ర చికిత్సలు చేపించుకున్నారు. వయసు ఎక్కువగా ఉండటం వల్ల ఆమె శరీరం అందుకు సహకరించలేదని తెలుస్తోంది.

ఫరాఖాన్‌ తల్లి మేనక ఇరానీ జులై 12న పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ సమయంలో సంతోషంగా ఉన్న ఆ ఫోటోలను ఫరాఖాన్‌ పంచుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఫరాఖాన్‌ దిగ్భ్రాంతి చెందారు. ఫరాఖాన్‌ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌, నటి, నిర్మాత, డ్యాన్సర్‌గా చిత్రపరిశ్రమలో రాణించారు. బాలీవుడ్‌లో టాప్‌ ప్రముఖుల లిస్ట్‌లో ఆమె ముందువరుసలో ఉంటుంది.

ఓం శాంతి ఓం, తీస్‌మార్‌ఖాన్‌, హ్యాపీ న్యూ ఇయర్‌ వంటి చిత్రాలను ఫరాఖాన్‌ డైరెక్ట్‌ చేశారు. సుమారు 100కి పైగా పాటలకు ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. గతేడాదిలో జవాన్‌ చిత్రంలో 'చెలెయా' సాంగ్‌కు ఆమె డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేశారు. ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో బిగ్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement