![Farah Khan Cried Watching Star Hero Dance: Nobody Can Teach You](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/7/FARAHKHAN1.jpg.webp?itok=VAsDc1as)
బాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోకు డ్యాన్స్ రాదని, తనకు నేర్పించడం చేతకాక ఏడ్చేశానంటోంది కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్. బాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న ఫరా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. సల్మాన్ ఖాన్ సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న కొత్తలో ఆడిషన్స్‌కు వెళ్లాడు. అలా ఓసారి స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు తనకు డ్యాన్స్ నేర్పించాను.
![](/sites/default/files/inline-images/FARAHKHAN.jpg)
స్టెప్పులేయడమే చేతకాదు
నాలుగు గంటలపాటు నేర్పిస్తూనే ఉన్నాను, కానీ తనకు రావట్లేదు. నీకు డ్యాన్స్ నేర్పించడం ఎవరి వల్లా కాదు. నీకసలు స్టెప్పులేయడమే చేతకాదని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాను. తర్వాత అతడిని మైనే ప్యార్ కియా సినిమాకు సెలక్ట్ చేశారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ మూవీలో అతడు ఒదిగిపోయే తీరు చూసి షాకైపోయాను అని చెప్పుకొచ్చింది.
సల్మాన్ జర్నీ
కాగా సల్మాన్ ఖాన్.. 1988లో 'బివి హో తో ఐసీ' అనే సినిమాతో వెండితెరపై ప్రయాణం ప్రారంభించాడు. దబాంగ్ సినిమాలో మున్నీ బద్నాం హూయి పాటలో సల్మాన్‌కు ఫరా స్టెప్పులు నేర్పించింది. మరెన్నో హిట్ సాంగ్స్‌కు సైతం ఫరాయే కొరియోగ్రఫీ చేసింది. సల్మాన్ గతేడాది.. కిసి కా భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3 చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం సికిందర్ సినిమా చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment