![Farah Khan says Shah Rukh Khan was Convinced Kamal Haasan would play Main Hoon Na Villain - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/8/Sharukhkhan-01.jpg.webp?itok=5-BuPo_G)
ఫరాఖాన్.. బాలీవుడ్‌లో పేరు మోసిన కొరియోగ్రాఫర్. దర్శకరచయితగా, నిర్మాతగానూ పేరు తెచ్చుకుంది. ఈమె డైరెక్టర్‌గా వ్యవహరించిన తొలి చిత్రం మై హూనా. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించాడు. అయితే విలన్ పాత్ర కోసం తీవ్రంగా శ్రమించానంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఫరా ఖాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'మై హూనా మూవీలో విలన్ కోసం ఎంతోమందిని సంప్రదించాను.
కమల్ ఒప్పుకుంటాడని షారుక్ ధీమా
కానీ ఎవరూ చేయడానికి ముందుకు రాలేదు.. నసీరుద్దీన్ షాను అడిగితే చేయనన్నాడు. కమల్ హాసన్ దగ్గరకు వెళ్లాను.. ఆయన కచ్చితంగా చేస్తాడని, తానంటే కమల్ సర్‌కు ఎంతో ఇష్టమని, ఇద్దరం కలిసి ఇదివరకే హే రామ్ అనే సినిమా కూడా చేశామని షారుక్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. కానీ ఆయన కూడా తిరస్కరించాడు. నానా పటేకర్‌ను కలిశా.. వారం రోజులకు ఆయన కూడా చేయనని చేతులెత్తేశాడు.
షారుక్ నిర్మాతగా తొలి మూవీ
చివరకు సునీల్ శెట్టి ఆ పాత్ర చేశాడు' అని ఫరా ఖాన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా షారుక్ ఖాన్ సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తెరకెక్కిన తొలి చిత్రం కావడం విశేషం. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తర్వాత ఫరా ఖాన్- షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలు రూపొందాయి.
చదవండి: రెండో పెళ్లి చేసుకున్న నటి మాజీ భర్త.. ఆశీర్వదించండంటూ పోస్ట్..
Comments
Please login to add a commentAdd a comment