జన్మలో మళ్లీ సాజిద్తో చేయను: బిపాషా | I will never work with Sajid Khan again: Bipasha basu | Sakshi
Sakshi News home page

జన్మలో మళ్లీ సాజిద్తో చేయను: బిపాషా

Published Fri, Aug 8 2014 1:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

జన్మలో మళ్లీ సాజిద్తో చేయను: బిపాషా - Sakshi

జన్మలో మళ్లీ సాజిద్తో చేయను: బిపాషా

తాను ఈ జన్మలో మళ్లీ సాజిద్ ఖాన్ దర్శకత్వంలో నటించబోనని నల్ల కలువ బిపాషా బసు తేల్చిచెప్పేసింది. 'హమ్షకల్స్' సినిమాలో ఉన్న ఆరు కీలక పాత్రల్లో బిపాషాది కూడా ఒకటి. అయితే, ఈ సినిమా అంతగా ఆడలేదు. సినిమా నిర్మాతలు వాషు భగ్నానీ, ఫాక్స్ స్టార్ స్టూడియోస్తో మాత్రం తనకు ఇబ్బంది ఏమీ లేదని.. సాజిద్ఖాన్ దర్శకత్వంలో మాత్రం నటించబోనని ఆమె చెబుతోంది.

సినిమా ఫలితం చూసి తాను చాలా డిస్ట్రబ్ అయ్యానని, తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు నిజంగానే తెలియదని తెలిపింది. నిర్మాతలు ఈ సినిమాను నమ్ముకుని చాలా డబ్బు పెట్టారని, అయితే తనకు అబద్ధాలు చెప్పడం రాదు కాబట్టే వేదికల మీదకు వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పింది. తాను పరిశ్రమలో చాలాకాలం నుంచి ఉన్నానని, చాలామందితో కలిసి పనిచేసిన ఎప్పుడూ ఎవరూ తనకు వ్యతిరేకంగా లేరని, ఈసారే ఇలా జరిగిందని వాపోయింది. సినిమాలో తాను కేవలం ఆరు నిమిషాలే ఉన్నానని, ఏం చేస్తున్నానో కూడా తనకు తెలియలేదని చెప్పింది. ఈ సినిమాలో బిపాషాతో పాటు సైఫ్ అలీఖాన్, రామ్ కపూర్, రితేష్ దేశ్ముఖ్, తమన్నా, ఈషాగుప్తా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement