Bangladesh vs Pakistan 2021: Pakistan Beat Bangladesh by an Innings and 8 Runs - Sakshi
Sakshi News home page

PAK Vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్‌ ఘన విజయం.. సిరీస్‌ కైవసం

Published Wed, Dec 8 2021 5:25 PM | Last Updated on Wed, Dec 8 2021 6:44 PM

Pakistan beat Bangladesh by an innings and 8 runs - Sakshi

Pakistan beat Bangladesh by an innings and 8 runs: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 2-0తేడాతో సిరీస్‌ను పాకిస్తాన్‌ వైట్‌వాష్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 87 పరుగులకే బంగ్లాదేశ్‌ కుప్పకూలింది. ఫాలో ఆన్‌ ఆడిన బంగ్లాదేశ్‌ 205 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా పాకిస్తాన్‌.. ఇన్నింగ్స్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్‌ బౌలర్లలో సజిద్‌ ఖాన్‌ 4 వికెట్లు పడగొట్టగా, షాహీన్‌ ఆఫ్రిది 2వికెట్లు సాధించాడు. కాగా అంతర్జాతీయ స్ధాయిలో తొలిసారి బౌలింగ్‌ చేసిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం ఒక వికెట్‌ పడగొట్టాడు.

ఇక ఈ టెస్ట్‌లో వర్షం కారణంగా రెండో రోజు, మూడో రోజు ఆట పూర్తిగా రద్దుకావడంతో పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ను 300-4 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అదే విధంగా తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాను పాక్‌ స్పిన్నర్‌ సాజిద్ ఖాన్ దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సాజిద్ ఖాన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు సాజిద్ ఖాన్ కు దక్కగా, మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌కు అబిడ్‌ ఆలీ ఎంపికయ్యాడు.

చదవండి: ICC Test Rankings: బౌలర్‌గా,ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన అశ్విన్‌.. నెం2..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement