Pak Vs Ban Test: Mehidy Hasan Peach Of A Delivery To Clean Up Babar Azam - Sakshi
Sakshi News home page

PAK Vs BAN: ఏంటి బాబర్‌ ఇదేమైనా గల్లీ క్రికెట్‌ అనుకున్నావా..

Published Mon, Nov 29 2021 10:22 AM | Last Updated on Mon, Nov 29 2021 12:28 PM

Mehidy Hasans peach of a delivery to clean up Babar Azam - Sakshi

Mehidy Hasans peach of a delivery to clean up Babar Azam:  ఛాటోగ్రామ్‌ వేదికగా పాకిస్థాన్‌,  బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 330 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కాగా  వికెట్‌ నష్టపోకుండా 140 పరుగులతో మూడో రోజు ఆట ఆరంభించిన పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో  286 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ 7 వికెట్లు సాధించి పాక్‌ పతనాన్ని సాధించాడు.

అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం ఔటైన తీరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మెహది హసన్ వేసిన అద్బుత డెలివరీకి ఆజాం వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్నింగ్స్‌ 72 ఓవర్‌లో మెహది హసన్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీకి బాబర్‌  ఢిపెన్స్‌ ఆడడానికి ప్రయత్నించగా.. అయితే బంతి టర్న్‌ అయ్యి ఆఫ్‌ స్టంప్‌ను తాకింది. దీంతో ఒక్క సారిగా బాబర్‌ ఆశ్చర్యానికి గురై పెవిలియన్‌కు చేరాడు.

ప్రస్తుతం బాబర్‌ ఔట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఓ నెట్‌జన్‌ స్పందిస్తూ.. 'ఏంటి బాబర్‌ ఇది ఏమైనా గల్లీ క్రికెట్‌ అనుకున్నావా .. ఇది ఇంటర్నేషల్‌ క్రికెట్‌' అంటూ కామెంట్‌ చేశాడు.

చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్‌ బౌలర్‌.. ఏకంగా 7 వికెట్లు...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement