mehadi hasan
-
న్యూజిలాండ్‌లో బంగ్లాదేశ్ సంచలనాలు: మొన్న అలా.. ఇప్పుడిలా!
New Zealand vs Bangladesh, 1st T20I: న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. మూడో వన్డేలో కివీస్‌ను చిత్తు చేసి చరిత్ర సృష్టించి బంగ్లా... మొదటి టీ20లో సంచలన విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్‌లో తొలి టీ20 గెలుపు నమోదు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిపత్యాన్ని 2-1కు తగ్గిస్తూ ఆఖరి మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. గెలుపు జోష్‌లో టీ20 సిరీస్‌ను మొదలుపెట్టిన బంగ్లా.. నేపియర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. స్పిన్నర్ మెహదీ హసన్ రెండు, షోరిఫుల్ ఇస్లాం వరుస వికెట్లు తీసి.. కివీస్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టారు. టాపార్డర్‌ను కకావికలం చేశారు. వీరిద్దరి దెబ్బకు ఓపెనర్లు ఫిన్ అలెన్(1), సీఫర్ట్(0).. డారిల్ మిచెల్(14), గ్లెన్ ఫిలిప్స్(0) పూర్తిగా విఫలమై పెవిలియన్ చేరారు. మిగిలిన వాళ్లలో జిమ్మీ నీషం 48, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 23 పరుగులతో రాణించగా.. నిర్నీత 20 ఓవర్లలో కివీస్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ 42 పరుగులు(నాటౌట్), నాలుగో నంబర్ బ్యాటర్ సౌమ్య సర్కార్ 22 పరుగులతో మెరుగ్గా ఆడారు. వీరిద్దరి తోడు మెహదీ హసన్ 16 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది బంగ్లాదేశ్. తద్వారా న్యూజిలాండ్ గడ్డ మీద పొట్టి ఫార్మాట్లో తొలి విజయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: #Virat kohli: విరాట్ కోహ్లికి ఘోర అవమానం! మండిపడుతున్న ఫ్యాన్స్ -
శ్రీలంకకు బంగ్లాదేశ్ షాక్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
గువహటి వేదికగా శ్రీలంకతో జరిగిన వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సన్నహాక మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో నిసాంక (68), ధనంజయ (55) అర్ధ సెంచరీలతో చెలరేగారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 264 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 42 ఓవర్లలో 3 వికెట్లకు 264 పరుగులు సాధించి గెలిపొందింది. బంగ్లా బ్యాటర్లలో తన్జీద్ (84), మిరాజ్ (67 నాటౌట్), లిటన్ దాస్ (61) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం.. 38 గంటలు విమానంలోనే! బెయిర్ స్టో ఫైర్ -
సెమీస్‌లో యశ్ ధుల్ హాఫ్ సెంచరీ.. భారత్ 211 ఆలౌట్! పాక్ మాత్రం ఏకంగా..
ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన భారత- ఏ జట్టు సెమీస్‌లో నామమాత్రపు స్కోరు చేసింది. బంగ్లాదేశ్- ఏ జట్టుతో మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య సెమీ ఫైనల్-2 మొదలైంది. యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు. వన్‌డౌన్ బ్యాటర్ నికిన్ జోస్ 17, ఆ తర్వాతి స్థానాల్లో ఆడిన యశ్ ధుల్ 66, నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్‌సిన్హ్ దోడియా 0(నాటౌట్) పరుగులు సాధించారు. కెప్టెన్ యశ్ ధుల్ అర్ధ శతకం కారణంగా భారత జట్టు 211 పరుగులు చేయగలిగింది. 49.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ రెండేసి వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో పాకిస్తాన్ ఇక పాకిస్తాన్- ఏ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో యశ్ ధుల్ సేన 8 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు యూఏఈ, నేపాల్‌లపై కూడా భారీ తేడాతో గెలుపొందింది. అయితే, సెమీ ఫైనల్లో బంగ్లాను చిత్తు చేస్తేనే ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో చెలరేగిన భారత బౌలర్లు కీలక మ్యాచ్‌లో ఎలా రాణిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. కాగా సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై గెలుపొందిన పాక్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! Leading from the front 💪 50* for skipper Yash Dhull 👏#EmergingAsiaCupOnFanCode #INDvBAN pic.twitter.com/tqPay3zS1Z — FanCode (@FanCode) July 21, 2023 -
ఓడిపోతారన్న దశలో ప్రపంచ రికార్డు భాగస్వామ్యంతో గెలిపించారు
అఫ్గనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. 45 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఈ దశలో అఫిఫ్ హొస్సేన్ (115 బంతుల్లో 93 నాటౌట్, 11 ఫోర్లు, 1 సిక్సర్), మెహదీ హసన్(120 బంతుల్లో 81 నాటౌట్, 9 ఫోర్లు) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు. చివరి వరకు నిలిచిన ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 174 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించడమే గాక బంగ్లాదేశ్‌కు మరుపురాని విజయం అందించారు . ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ 49.1 ఓవర్లలో 215 పరుగులుకు ఆలౌటైంది. నజీబుల్లా 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రహమత్ 34 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, తస్కిన్ అహ్మద్, షకీబ్, షోరిఫుల్ హొసెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా బంగ్లాదేశ్ మ్యాచ్ విజయంతో పాటు పలు రికార్డులు బద్దలు కొట్టింది. ►వన్డే క్రికెట్ చరిత్రలో ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన రెండో జంటగా మెహదీ హసన్, అఫిఫ్ హొస్సేన్‌లు నిలిచారు. తొలి స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన జాస్ బట్లర్, ఆదిల్ రషీద్‌లు( 177 పరుగులు భాగస్వామ్యం, 2015లో న్యూజిలాండ్‌పై) ఉన్నారు. ►ఇంతకముందు బంగ్లాదేశ్‌కు వన్డేల్లో ఏడో వికెట్‌కు ఇమ్రుల్ కైస్, మహ్మద్ సైఫుద్దీన్ జోడి నమోదు చేసిన 127 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమంగా ఉంది. తాజాగా ఈ రికార్డును మెహదీ హసన్- అఫిఫ్ హొస్సేన్ జోడి బద్దలు కొట్టింది. ►ఇక బంగ్లాదేశ్ తరపున వన్డేల్లో ఏడో వికెట్‌కు 100 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జంటగా మెహదీ హసన్- అఫిఫ్ హొస్సేన్‌లు నిలిచారు. అంతకముందు ఇమ్రుల్ కైస్- మహ్మద్ సైఫుద్దీన్(2018లో జింబాబ్వేపై), ముష్ఫికర్ రహీమ్- నయీమ్ ఇస్లామ్(2010లో న్యూజిలాండ్‌పై) ఉన్నారు. ►బంగ్లాదేశ్ తరపున ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వన్డేల్లో 50ప్లస్ స్కోర్లు రెండుసార్లు సాధించిన మూడో ఆటగాడిగా మెహదీ హసన్ నిలిచాడు. ఇంతకముందు నాసిర్ హొసేన్, మహ్మద్ సైఫుద్దీన్‌లు ఉన్నారు. చదవండి: Sanju Samson: సంజూలో మంచి టాలెంట్ ఉంది.. సరైన రీతిలో వాడుకుంటాం: రోహిత్ శర్మ 1⃣7⃣4⃣* Afif Hossain 🤝 Mehidy Hasan The second-highest partnership for the seventh wicket in men's ODIs 🔥#BANvAFG pic.twitter.com/1kI2gF9imj — ICC (@ICC) February 23, 2022 -
ఏంటి బాబర్ ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకున్నావా..
Mehidy Hasans peach of a delivery to clean up Babar Azam: ఛాటోగ్రామ్ వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 330 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కాగా వికెట్ నష్టపోకుండా 140 పరుగులతో మూడో రోజు ఆట ఆరంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ 7 వికెట్లు సాధించి పాక్ పతనాన్ని సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం ఔటైన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెహది హసన్ వేసిన అద్బుత డెలివరీకి ఆజాం వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్నింగ్స్ 72 ఓవర్లో మెహది హసన్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీకి బాబర్ ఢిపెన్స్ ఆడడానికి ప్రయత్నించగా.. అయితే బంతి టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను తాకింది. దీంతో ఒక్క సారిగా బాబర్ ఆశ్చర్యానికి గురై పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం బాబర్ ఔట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఓ నెట్‌జన్ స్పందిస్తూ.. 'ఏంటి బాబర్ ఇది ఏమైనా గల్లీ క్రికెట్ అనుకున్నావా .. ఇది ఇంటర్నేషల్ క్రికెట్' అంటూ కామెంట్ చేశాడు. చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు... Athar Ali Khan is super excited after seeing Babar out by Mehdi ,🤪#PakvsBan pic.twitter.com/pwaAURCIF4 — Jawad Ahmad (@Jawadspeaks_) November 28, 2021 -
ఇద్దరు కన్కషన్ సబ్స్టిట్యూట్లు
బంగ్లాదేశ్ జట్టు రెండో టెస్టుకు రెండు మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన మెహదీ హసన్, తైజుల్లను తుది జట్టు నుంచి తప్పించింది. అయితే అనూహ్యంగా వీరిద్దరు రెండో టెస్టులోనూ కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది. ఈ ఇద్దరు కన్కషన్ సబ్స్టిట్యూట్లుగా బరిలోకి దిగారు. ఒకే రోజు ఇలా ఇద్దరు కన్కషన్ సబ్స్టిట్యూట్లు రావడం అనూహ్యం. మొహమ్మద్ షమీ విసిరిన బంతులకు లిటన్ దాస్, నయీమ్ హసన్ మైదానం వీడటమే అందుకు కారణం. షమీ వేసిన బౌన్సర్‌ను పుల్ చేయబోవడంతో లిటన్ దాస్ తలకు దెబ్బ తగిలింది. ఆ తర్వాత మరో ఆరు బంతులు ఆడినా... మగతగా ఉండటంతో దాస్ పెవిలియన్ వెళ్లిపోయాడు. రిఫరీతో మాట్లాడిన అనంతరం అతని స్థానంలో మెహదీ హసన్ (రెగ్యులర్ బౌలర్)ను ఎంపిక చేశారు. అయితే దాస్ పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్ కాబట్టి ఐసీసీ నిబంధన ప్రకారం హసన్ బ్యాటింగ్ మాత్రమే చేశాడు. అతను బౌలింగ్ చేయడానికి అవకాశం లేదు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లోనే నయీమ్ హసన్‌కు కూడా ఇలాగే జరిగింది. స్వల్ప చికిత్స తర్వాత నయీమ్ బ్యాటింగ్ కొనసాగించి కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచాడు. అవుటైన అనంతరం అతనూ ఆస్పత్రికి పరుగు తీశాడు. దాంతో ఆఫ్ స్పిన్నరైన నయీమ్ స్థానంలో మరో ఆఫ్ స్పిన్నర్ తైజుల్ బౌలింగ్‌కు దిగి తొలి రోజు ఎనిమిది ఓవర్లు వేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ రిజర్వ్ ఆటగాళ్లలో ఒక్క రెగ్యులర్ బ్యాట్స్‌మన్ కూడా లే డు. తొలి టెస్టుకు ముందే మొసద్దిక్ హుస్సేన్ వ్యక్తిగత కారణాలతో జట్టును వీడినా ఇన్ని రోజుల్లో మరో బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేయలేదు. కోల్‌కతా టెస్టుకు రెండు రోజుల ముందు సైఫ్ హసన్ గాయపడ్డాడు. ఢాకా నుంచి కోల్‌కతా ఫ్లయిట్లో 30 నిమిషాల ప్రయాణమైనా సరే మరో బ్యాట్స్‌మన్ పంపే ప్రయత్నం కూడా బోర్డు చేయలేదు! -
హైదరాబాద్ ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన హైదరాబాద్ జట్టు విజయ్ హజారే వన్డే టోర్నీలో మూడో విజయాన్ని అందుకుంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌పై 101 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (16), అక్షత్ రెడ్డి (25; 4 ఫోర్లు) త్వరగానే పెవిలియన్ చేరినా... వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ కె. రోహిత్ రాయుడు (102 బంతుల్లో 75; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. బావనక సందీప్ (44; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్‌కు 77 పరుగుల్ని జోడించాడు. జట్టు స్కోరు 172 పరుగుల వద్ద అశుతోష్ సింగ్ బౌలింగ్‌లో సుమిత్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో 222 పరుగుల వద్ద హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. ప్రత్యర్థి బౌలర్లలో పంకజ్ రావు 3, సుమిత్ 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 223 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఛత్తీస్‌గఢ్‌ను బౌలర్లు మెహదీ (3/19), సాకేత్ (3/28), ఆకాశ్ భండారి (2/31) కట్టడి చేశారు. వీరి ధాటికి ఛత్తీస్‌గఢ్ 33.3 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. తొమ్మిది జట్లున్న గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆరు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచి, రెండింటిలో ఓడింది. మరో మ్యాచ్ రద్దయింది. ప్రస్తుతం హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో 2న కేరళతో... 6న ఒడిశాతో ఆడనుంది. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ ఎల్బీడబ్ల్యూ (బి) జతిన్ 16; అక్షత్ రెడ్డి (సి) హర్‌ప్రీత్ (బి) సుమిత్ 25; రోహిత్ రాయుడు (సి) సుమిత్ (బి) అశుతోష్ 75; సుమంత్ (సి) హర్‌ప్రీత్ (బి) అజయ్ 13; సందీప్ (సి) అశుతోష్ (బి) పంకజ్ 44; ఆశిష్ (సి) జతిన్ (బి) పంకజ్ 14; ఆకాశ్ భండారి (సి) జతిన్ (బి) పంకజ్ 9; మిలింద్ రనౌట్ 8; సిరాజ్ (సి) అశుతోష్ (బి) సుమిత్ 4; మెహదీ హసన్ నాటౌట్ 3; సాకేత్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–44, 2–54, 3–95, 4–172, 5–195, 6–195, 7–213, 8–217, 9–217. బౌలింగ్: పంకజ్ 10–0–41–3, విశాల్ సింగ్: 10–0–61–0, సుమిత్ 9–0–41–2, జతిన్ 10–0–34–1, అజయ్ 6–0–19–1, అశుతోష్ 5–0–21–1. ఛత్తీస్‌గఢ్ ఇన్నింగ్స్: రిషభ్ (సి) సుమంత్ (బి) మెహదీ హసన్ 7; అశుతోష్ (బి) ఆకాశ్ భండారి 38; హర్‌ప్రీత్ (సి) మిలింద్ 2; అమన్‌దీప్ రనౌట్ 10; సంజీత్ (సి)భండారి (బి) సాకేత్ 2; మనోజ్ ఎల్బీడబ్ల్యూ (బి) సాకేత్ 5; అజయ్ (బి) ఆకాశ్ 3; విశాల్ (సి) సుమంత్ (బి) సాకేత్ 1; జతిన్ (సి) మిలింద్ (బి) మెహదీ హసన్ 37; సుమిత్ ఎల్బీడబ్ల్యూ (బి) మెహదీ హసన్ 11; పంకజ్ రావు నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (33.3 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1–34, 2–37, 3–60, 4–62, 5–64, 6–70, 7–73, 8–73, 9–94, 10–121. బౌలింగ్: సిరాజ్ 4–0–23–0, మిలింద్ 5–0– 20–1, మెహదీ హసన్ 7.3–1–19–3, సాకేత్ 8–1–28–3, ఆకాశ్ భండారి 9–0–31–2. -
మెహదీ హసన్ 8/98
విదర్భతో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా సాక్షి, హైదరాబాద్: విద ర్భ, హైదరాబాద్ జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగి సింది. రంజీ సీజన్ కు సన్నాహకంగా విదర్భతో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ స్పిన్నర్ మెహదీ హసన్ (8/98) తిప్పేశాడు. దీంతో 116/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆటకొనసాగించిన విదర్భ 107.3 ఓవర్లలో 324 పరుగుల వద్ద ఆలౌటైంది. శ్రీవాస్తవ్ (79), రవి (64), సిద్ధేశ్ (59) అర్ధసెంచరీలతో రాణించారు. రెండో రోజు ఆటలో హైదరాబాద్ 380/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.