
ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన భారత- ఏ జట్టు సెమీస్‌లో నామమాత్రపు స్కోరు చేసింది. బంగ్లాదేశ్- ఏ జట్టుతో మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య సెమీ ఫైనల్-2 మొదలైంది.
యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు.
వన్‌డౌన్ బ్యాటర్ నికిన్ జోస్ 17, ఆ తర్వాతి స్థానాల్లో ఆడిన యశ్ ధుల్ 66, నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్‌సిన్హ్ దోడియా 0(నాటౌట్) పరుగులు సాధించారు.
కెప్టెన్ యశ్ ధుల్ అర్ధ శతకం కారణంగా భారత జట్టు 211 పరుగులు చేయగలిగింది. 49.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ రెండేసి వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఫైనల్లో పాకిస్తాన్
ఇక పాకిస్తాన్- ఏ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో యశ్ ధుల్ సేన 8 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు యూఏఈ, నేపాల్‌లపై కూడా భారీ తేడాతో గెలుపొందింది.
అయితే, సెమీ ఫైనల్లో బంగ్లాను చిత్తు చేస్తేనే ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో చెలరేగిన భారత బౌలర్లు కీలక మ్యాచ్‌లో ఎలా రాణిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. కాగా సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై గెలుపొందిన పాక్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్!
Leading from the front 💪
— FanCode (@FanCode) July 21, 2023
50* for skipper Yash Dhull 👏#EmergingAsiaCupOnFanCode #INDvBAN pic.twitter.com/tqPay3zS1Z