
గువహటి వేదికగా శ్రీలంకతో జరిగిన వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సన్నహాక మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో నిసాంక (68), ధనంజయ (55) అర్ధ సెంచరీలతో చెలరేగారు.
బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 264 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 42 ఓవర్లలో 3 వికెట్లకు 264 పరుగులు సాధించి గెలిపొందింది. బంగ్లా బ్యాటర్లలో తన్‌జీద్ (84), మిరాజ్ (67 నాటౌట్), లిటన్ దాస్ (61) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు.
చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం.. 38 గంటలు విమానంలోనే! బెయిర్ స్టో ఫైర్
Comments
Please login to add a commentAdd a comment