బంగ్లాదేశ్‌తో విజయంతో ఆరంభించింది. ఛటోగ్రామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్లతో తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా విజయంతో కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో కీలక పాత్ర పోషించాడు.
నజ్ముల్ హుస్సేన్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. 129 బంతుల్లో శాంటో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 122 పరుగులు చేశాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ముస్తిఫికర్ రహీమ్(73 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో మధుశంక రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రమోద్ మధుషాన్, కుమారా తలా వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లంక 48.5 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాటర్లలో లియాంగే(67) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(59) పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ ఆహ్మద్, షోర్‌ఫుల్ ఇస్లాం, టాన్జిమ్ హసన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 ఛటోగ్రామ్ వేదికగా శుక్రవారం జరగనుంది.
చదవండి: IPL 2024: ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు.. ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment